»   » మామ టైటిల్‌తో వస్తున్న మెగా అల్లుడు... ‘విజేత’గా నిలిపే ప్రయత్నం!

మామ టైటిల్‌తో వస్తున్న మెగా అల్లుడు... ‘విజేత’గా నిలిపే ప్రయత్నం!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Kalyan Dev's New Movie Name Got Fixed

  మెగాస్టార్ చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రానికి 'విజేత' అనే పేరు ఖరారు చేస్తూ టైటిల్ లోగో పోస్టర్ విడుదల చేశారు. 1985లో చిరంజీవి నటించిన 'విజేత' అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇదే టైటిల్‌ మెగా అల్లుడి చిత్రానికి ఫిక్స్ చేయడం హాట్ టాపిక్ అయింది. చిన్నల్లుడిని ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టేందుకు మెగాస్టార్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని, అందులో భాగంగానే కళ్యాణ్ దేవ్ చిత్రానికి ఈ టైటిల్ ఫిక్స్ చేసినట్లు చర్చించుకుంటున్నారు.

   సినిమా కాన్సెప్ట్ ఏమిటి?

  సినిమా కాన్సెప్ట్ ఏమిటి?

  ‘ఇతరులు ముఖాల్లో నవ్వులు వెలిగించడం కూడా ఒక విజయమే' అంటూ టైటిల్ పోస్టర్ మీద కొటేషన్స్ వేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ లైన్ బట్టి సినిమా టైటిల్ వెనక ఉన్న పరమార్థం ఏమిటో అర్థం చేసుకోవచ్చని, ఇతరులను సంతోష పెట్టడమే లక్ష్యంగా హీరో క్యారెక్టర్ ఉంటుందని భావిస్తున్నారు.

  చివరి దశలో షూటింగ్

  చివరి దశలో షూటింగ్

  వారాహి చలన చిత్రం బేనర్లో ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. మాళవిక నాయర్ ఈచిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. ఇటీవలే డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి.

  రొటీన్ సినిమాలకు భిన్నంగా

  రొటీన్ సినిమాలకు భిన్నంగా

  బాహుబలి లాంటి భారీ ప్రాజెక్టుకు పని చేసిన కెకె సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రోటీన్ సినిమాలకు భిన్నంగా ఒక డిఫరెంట్ కాన్సెప్టుతో ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు.

  ‘విజేత' కాస్ట్ అండ్ క్రూ

  ‘విజేత' కాస్ట్ అండ్ క్రూ

  ఈ చిత్రంలో ఇంకా తనికెళ్ల భరణి, మురళీ శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పోసాని కృష్ణ మురళి, రాజీవ్ కనకాల, జయ ప్రకాష్(తమిళ నటుడు), ఆదర్శ్ బాలకృష్ణ, నోయల్, కిరిటీ, బద్రం, సుదర్శన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్దన్ రామేశ్వర్, లిరిక్స్: రెహమాన్, రామజోగయ్య శాస్త్రి, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, ఆర్ట్: రామకృష్ణ, స్టంట్స్: జాషువా, నిర్మాణ సంస్థ: సాయి కొర్రపాటి ప్రొడక్షన్, సమర్పణ: సాయి శివాని, నిర్మాత: రజనీ కొర్రపాటి, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: రాకేష్ శశి.

  English summary
  The title of Megastar Chiranjeevi’s son-in-law Kalyaan Dhev’s debut film is announced as ‘Vijetha.’ This is the same title of Megastar’s 1985 blockbuster.This new film’s title comes up with a caption ‘Lighting up smiles on others faces is also success’ which makes it quite interesting. Rakesh Sashii is directing the movie while Malavika Nair plays the female lead. The film’s shooting is in final stages and very recently the dubbing works have begun.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more