»   » హీరోయిన్‌తో ఎఫైర్, టాప్ డైరెక్టర్ ఆత్మహత్య ఆలోచన....!

హీరోయిన్‌తో ఎఫైర్, టాప్ డైరెక్టర్ ఆత్మహత్య ఆలోచన....!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ ప్రముఖ దర్శకులలో ఒకరు విక్రమ్ భట్. సినిమాలతో పాటు ఎఫైర్లకు సంబంధించిన వార్తలతో విక్రమ్ భట్ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఒకప్పుడు అందాల సుందరి సుష్మితా సేన్ తో, తర్వాత హీరోయిన్ అమీషా పటేల్ తో విక్రమ్ భట్ ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే.

తాజాగా ఓ ఆంగ్ల ప్రతికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు విక్రమ్ భట్. సుష్మితా సేన్ తో బ్రేకప్ తర్వాత తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, ఆరో అంతస్తులో ఉన్న తన ఇంటి బాల్కానీ నుండి దూకి చచ్చిపోవాలనుకున్నట్లు వెల్లడించారు.

కారణం కేవలం సుష్మిత కాదు

కారణం కేవలం సుష్మిత కాదు

అపుడు తాను ఆత్మహత్య చేసుకోవాలను కోవడానికి కారణం కేవలం సుష్మిత సేన్ కాదు. నా జీవితంలో నేను చేసిన కొన్ని పనులే తనకు ఆ ఆలోచన వచ్చేలా చేసాయి అని విక్రమ్ భట్ చెప్పుకొచ్చాడు.

కారణాలు ఇవే

కారణాలు ఇవే

అప్పటికే నాకు భార్య అదితితో విడాకులు అయ్యాయి. నా సినిమా గులామ్ అపుడు రిలీజ్ అవ్వాల్సి ఉంది. అప్పటికి నేను కేవలం సుస్మితా సేన్ బాయ్ ఫ్రెండుగా ఉన్నాను. మరో వైపు నా కూతురును చాలా మిస్సయ్యాననే ఫీలింగ్ చుట్టుముట్టింది. చాలా డిప్రెషన్ కు లోనయ్యాను, అందుకే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను అని విక్రమ్ భట్ తెలిపారు.

నా భార్యను మోసం చేసాను

నా భార్యను మోసం చేసాను

సుస్మితా సేన్ తో ఎఫైర్ పెట్టుకుని నా భార్యను మోసం చేసాను. నా భార్యను, బిడ్డను చాలా బాధ పెట్టాను. నేను చేసిన పనికి తర్వాత చాలా చింతించాను, ఇప్పటికీ చింతిస్తున్నాను అని విక్రమ్ భట్ చెప్పుకొచ్చారు.

అందులో వాళ్ల గురించి ఉండదు

అందులో వాళ్ల గురించి ఉండదు

విక్రమ్ భట్ ఇటీవల ‘హ్యాండ్ పుల్ ఆఫ్ సన్ షైన్' అనే పుస్తకం రిలీజ్ చేసారు. ఇది విక్రమ్ భట్ జీవితాన్ని ప్రతిబింభించేలా ఉంటుందని అంతా భావిస్తున్నారు. అయితే ఇది తన ఆటో బయోగ్రఫీ కాదని, రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా దీన్ని రాసానని విక్రమ్ భట్ తెలిపారు.

English summary
Sushmita Sen and Vikram Bhatt were one of Bollywood's most happening couples. It was their affair that drove a wedge between him and his then-wife Aditi. In fact, Vikram had even admitted that he had suicidal thoughts when things went awry. In an interview with HT.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu