twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తాగి ఉన్నా, ఆమె మరణానికి కారణం నేనే: నటి హత్య కేసులో బుక్ అయిన హీరో

    పాపులర్ మోడల్, టీవీ ప్రైం టైం హోస్ట్ సోనికా చౌహాన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేసులో ఆమె తో పాటూ ప్రయాణించిన విక్రమ్ చటర్జీనే నేరస్తుడిగా తేల్చారు పోలీసులు.

    |

    యువ హీరో విక్రమ్‌ ఛటర్జీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాడు. మోడల్‌, నటి సోనికా చౌహాన్‌ మృతి కేసులో పోలీసులు ఆయనపై తీవ్ర అభియోగాలు మోపారు. అవి నిరూపణఅయితే విక్రమ్‌కు కనీసం 10 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది. ప్రమాద సమయంలో తాను మద్యం సేవించి ఉన్నానని ఆమె బాయ్ ఫ్రండ్ విక్రమ్ ఛటర్జీ ఒప్పుకున్నాడు.

    సోనికా చౌహాన్

    సోనికా చౌహాన్

    పాపులర్ మోడల్, టీవీ ప్రైం టైం హోస్ట్ సోనికా చౌహాన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. పశ్చిమ కోల్ కతాలో ఏప్రిల్ 29న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. టీవీ యాక్టర్ విక్రమ్‌ ఛటర్జీ సహా ఆమె కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

    యాక్సిడెంట్ లో

    యాక్సిడెంట్ లో

    విక్రమ్ డ్రైవ్ చేస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో పక్కనే కూర్చున్న సోనికా తీవ్రగాయాలపాలై ప్రాణాలు కోల్పోగా, డ్రైవింగ్ సీట్ లో ఉన్న విక్రమ్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. వెంటనే స్థానికులు స్పందించి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సోనికా మృతిచెందింది. యాక్సిడెంట్ లో కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది.

    టయోటా కరోలా ఆల్టీస్

    టయోటా కరోలా ఆల్టీస్

    రిపోర్ట్స్ ప్రకారం, విక్రమ్ నడుపుతున్న టయోటా కరోలా ఆల్టీస్ కారు నియంత్రణ కోల్పోవడం ద్వారా డివైడర్లను ఢీ కొట్టి ప్రక్కనే ఫుట్ పాత్ మీద ఉన్న స్టాల్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదం దక్షిణ కలకత్తాలోని రాష్‌బీహారీ అవెన్యూలో ఉన్న లేక్ మాల్ వద్ద చోటుచేసుకుంది.

    విక్రమ్ ఫుల్ గా మద్యం సేవించి

    విక్రమ్ ఫుల్ గా మద్యం సేవించి

    ఇంతకీ ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాన్ని చూస్తే.. విక్రమ్ ఫుల్ గా మద్యం సేవించి.. ర్యాష్ డ్రైవింగ్తోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో విక్రమ్‌ కారు నడుపుతున్నట్లు తేలడంతో పోలీసులు అతడిని ప్రశ్నించారు. తాను తాగి కారు నడపలేదని విక్రమ్‌ తొలుత చెప్పినప్పటికీ.. పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది.

    ఐపీసీ సెక్షన్ 304

    ఐపీసీ సెక్షన్ 304

    తాగి వాహనాన్ని నడిపినప్పటికి.. తాను మద్యం సేవించలేదంటూ విక్రం పోలీసులకు వెల్లడించారు. అయితే.. పోలీసుల విచారణలో మాత్రం అతగాడు ఫుల్ గా తాగేసి కారును నడపటంతోనే ప్రమాదం జరిగిందని గుర్తించారు.దీంతో అతనిపై మొదట నమోదు చేసిన ర్యాష్ డ్రైవింగ్ నేరారోపణతో పాటు ఐపీసీ సెక్షన్ 304 ను అభియోగం నమోదైంది.

    మరణానికి కారణమైన హత్య

    మరణానికి కారణమైన హత్య

    హత్య చేయకున్నా.. మరణించటానికి కారణమైన నేపథ్యంలో ఆ హీరో మీద కేసు బుక్ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ అభియోగం కానీ కోర్టులో నిరూపితమైతే.. సదరు యువ హీరోకి కనిష్ఠంగా 10ఏళ్లు జైలుశిక్ష పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

    English summary
    Vikram had earlier been charged with causing death due to rash and negligent driving for which the maximum punishment is two years. Section 304 of the Indian Penal Code or culpable homicide not amounting to murder means he can be jailed for up to 10 years.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X