»   » నాగార్జున అడిగింది ఒకటి..విక్రమ్ కుమార్ చేస్తున్నది మరొకటి !

నాగార్జున అడిగింది ఒకటి..విక్రమ్ కుమార్ చేస్తున్నది మరొకటి !

Subscribe to Filmibeat Telugu

ఇష్క్, 24, మనం వంటి చిత్రాలతో తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్నాడు దర్శకుడు విక్రమ్ కుమార్. ఇటీవల విక్రమ్ కుమార్ అఖిల్ తో హలో చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. దీనితో విక్రమ్ కుమార్ తదుపరి ఎలాంటి చిత్రం చేయాలనే డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మధ్యన నాగార్జున తన తనయుడు నాగ చైతన్యతో ఓ చిత్రాన్ని చేయాలని కోరినట్లు ప్రచారం జరిగింది. కానీ విక్రమ్ కుమార్ ప్రస్తుతం బాలీవుడ్ బాట పట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

Vikram Kumar will going to direct Akshay Kumar

విక్రమ్ కుమార్ ఇది వరకే 13బి అనే బాలీవుడ్ చిత్రాన్ని మాధవన్ తో తెరకెక్కించి ఉన్నారు. కాగా విక్రమ్ కుమార్ ఇప్పుడు అక్షయ్ కుమార్ తో సినిమా చేయడానికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. తనకోసం మంచి కథ సిద్ధం చేయమని అక్షయ్ కుమార్ విక్రమ్ కుమార్ ని కోరాడట. తాజాగా విక్రమ్ కుమార్ స్క్రిప్ట్ తో అక్షయ్ వద్దకు వెళ్లాడని, కథ నచ్చడంతో అక్షయ్ పచ్చజెండా ఊపినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. జూన్ నుంచి ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. నాగచైతన్య తో సినిమా చేయాలని నాగార్జున కోరినా ప్రస్తుతం నాగచైతన్య బిజీగా ఉన్నాడు. దీనితో విక్రమ్ కుమార్ అక్షయ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

English summary
Vikram Kumar will going to direct Akshay Kumar. Vikram Kumar already narrated script to Akshay
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu