For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సెప్టెంబర్ 8న ఇంకొక్కడు గ్రాండ్ రిలీజ్ : కొన్ని తెరవెనుక సంగతులు

  |

  పాత్రల కోసం ఎంత రిస్క్ అయినా చేసే నటుల్లో చాలా అరుదుగా మనకు కనపడతారు. విక్రం అదే కోవకు చెందుతాడు. ఏ పాత్ర చేసినా అందలో జీవించే ప్రయత్నం చేస్తుంటాడు.. శ్మశానంలో ఉండి మాటలు రాని శివపుత్రుడుగా ఉత్తమ అభినయాన్ని కనపరిచి జాతీయ అవార్డును దక్కించుకున్న విక్రమ్, కూతురుపై ప్రేమను అద్భుతంగా వ్యక్తం చేసే నాన్నగా, గ్రుడ్డివాడు విక్రమ్ చేసిన శివతాండవంను ప్రేక్షకులు మరచిపోలేరు. అలాగే స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తిగా, అన్యాయాన్ని ఎదిరించిన అపరిచితుడుగా అద్బుతమైన నటన ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచింది..

  ఐ చిత్రంలో కురూపిగా విక్రమ్ నటన అందరి ప్రశంసలు అందుకుంది. ఇలాంటి విలక్షణ నటుడు విక్రమ్ ఇంకొక్కడు గా రానున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన ఈ చిత్రంలో రా ఏజెంట్ గానే కాకుండా, లవ్ అనే హిజ్రా పాత్రలో విక్రమ్ నటన ప్రేక్షకులకు కనువిందు చేయడం గ్యారంటీ. విక్రమ్ నటనతో పాటు హ్యరీష్ జైరాజ్ అందించిన పాటలకు, థియేట్రికల్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

  ఓ డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఇంకొక్కడు చిత్రంలో నయనతార, నిత్యామీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమిళంలో ఇరుముగన్ అనే పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్.కె.ఆర్.ఫిలింస్ బ్యానర్ అధినేత నీలం కృష్ణారెడ్డి ఇంకొక్కడుగా సెప్టెంబర్ 8న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన మరికొన్ని విశేషాలు....

  తమిళంలో ఇరుముగన్

  తమిళంలో ఇరుముగన్

  విక్రమ్, నయనతార, నిత్యామీనన్ ప్రధాన పాత్రలుగా తమిళంలో ఇరుముగన్ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇంకొక్కడు అనే టైటిల్ తో తెలుగులో విడుదల కానుంది. ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తోండగా శిభు థమీన్స్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

  యూ/ఏ సర్టిఫికెట్

  యూ/ఏ సర్టిఫికెట్

  సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసింది. సెన్సార్ బృందం ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. తెలుగులో మరో రెండు రోజుల తర్వాత సెన్సార్ పూర్తి కానుందని, ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో సెప్టెంబర్ 8న విడుదల కానున్నట్టు యూనిట్ తెలిపింది.

  ఒకరోజు ముందే విడుదల

  ఒకరోజు ముందే విడుదల

  మొదట సెప్టెంబర్ 9న విడుదల చేస్తారని ప్రచారం జరిగినా, లాంగ్ వీకెండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఒకరోజు ముందుకు విడుదలను మార్చేసింది.

  లవ్

  లవ్

  ఇటు హీరోగా అటు విలన్ గా విక్రమ్ మరోసారి తన నటనా నైపుణ్యాన్ని ప్రదర్శించనుండగా .. లవ్ అనే పాత్ర సినిమాకే హైలైట్‍గా నిలుస్తుందని ప్రచారం జరుగుతోంది.

  ఆనంద్ శంకర్త

  ఆనంద్ శంకర్త

  మిళ్ లో ‘అరిమనంబి' చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార, నిత్యమీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

  కొత్త లుక్

  కొత్త లుక్

  సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో విక్రమ్ కండలుతిరిగిన దేహంతో కొత్త లుక్ లో అదిరిపోయాడు.

  లవ్

  లవ్

  ఈపటికే ట్రైల లో ఉన్న యాక్షన్ సీన్స్, విలన్ అయిన "లవ్" పాత్రలో విక్రమ్ గెటప్ సినిమాపై మరిన్ని అంచనాల్ని పెంచేస్తోంది.

  ఒక ప్రక్కన బారీతీయ ఇంటెలిజెన్స్ (రా) ఆఫీసర్ గా

  ఒక ప్రక్కన బారీతీయ ఇంటెలిజెన్స్ (రా) ఆఫీసర్ గా

  ఒక ప్రక్కన బారీతీయ ఇంటెలిజెన్స్ (రా) ఆఫీసర్ గా.....మరో ప్రక్కన ఒక హిజ్రా విలన్ గా కనిపించనున్నాడు విక్రమ్. మలేషియాలో కెమికల్ సైంటిస్ట్ అయిన లవ్ అనే ఒక హిజ్రా డ్రగ్స్ సప్లయ్ చేస్తుంటాడు. అతగాడిని పట్టుకోవడానికి ఇండియా నుండి ఇద్దరు ఆఫీసర్లు వస్తారు.. ఒకరు విక్రమ్ మరొకరు నిత్యా మీనన్.

  నయన తార కూడా

  నయన తార కూడా

  విక్రమ్, నయనతార మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని, ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు ఆకట్టుకుంటాయని అంటున్నారు.

  6 కోట్లు

  6 కోట్లు

  ఈ చిత్ర తెలుగు వర్షన్ హక్కులు రూ.6 కోట్లకు అమ్ముడైనట్లు టాక్. విక్రమ్ సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంది.

  English summary
  Vikram's "Inkokkadu" makers confirmed the release date September 8th, 2016 in order to avoid the clash with other movies which are releasing on the occasion of Dushera.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X