»   » కూతురు ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్స్, అంత వయస్సున్న కూతురు ఉందా?

కూతురు ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్స్, అంత వయస్సున్న కూతురు ఉందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తమిళ స్టార్ హీరో విక్రమ్ కు టీనేజ్ కొడుకు, కూతురు ఉన్నారంటే నమ్మలేం. ఈ 50 ఏళ్ల స్టార్ ఇప్పటికీ తన శరీరంతో ప్రయోగాలు చేస్తూ అందరనీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆయనకు టీనేజ్ కుమార్తె అక్షిత, కుమారుడు ధ్రువ్ ఉన్నారు.

ఇప్పుడు వార్త ఏమిటీ అంటే ...ఆయన కుమార్తె అక్షిత నిశ్చితార్దం ఫిక్స్ అయ్యింది. చెన్నై బేసెడ్ కేర్ బేకరీ రంగనాధన్ కుమారుడు మను రంగనాధన్ తో ఆమెకు వివాహం నిశ్చియమైంది. జూలై 10 న నిశ్చితార్దం జరగనుంది. వచ్చే సంవత్సరం వివాహం జరగనుంది.

అక్షిత, మను గత కొద్ది కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. వారు తమ పెద్దల అనుమతితో తమ బంధాన్ని బలపరుచుకోవాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే విక్రమ్ కుమారుడు...ఓ నోటెడ్ డైరక్టర్ డైరక్షన్ లో కనిపించనున్నట్లు సమాచారం.

 Vikram's Daughter to get Engaged on July 10th


ఇక విక్రమ్ కెరీర్ విషయానికి వస్తే... ఆయన కొత్త 'ఇరు ముగన్' త్వరలో రిలీజ్ కానుంది. ఆ మధ్యన ఈ చిత్రం ఫస్ట్ లుక్ టైటిల్ విడుదల చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పోస్టర్ సినిమా మీద విపరీతమైన ఆసక్తి రేపేలా ఉంది. చాలా డిఫరెంటుగా అనిపిస్తున్న ఈ పోస్టర్ లో ఓవైపు విక్రమ్ ముఖం సగం మామూలుగా ఇంకో సగం వ్యోమగామి తరహాలో కనిపిస్తోంది.

 Vikram's Daughter to get Engaged on July 10th

మొత్తానికి ఇదేదో సైన్స్ ఫిక్షన్ కావచ్చు అంటున్నారు. వరుసగా ప్రయోగాలు చేసి ఎదురు దెబ్బలు తింటున్నప్పటికీ విక్రమ్ ఏమాత్రం వెనుకంజ వేయట్లేదని ఈ లుక్ ను బట్టి తెలుస్తోంది. ఈ చిత్రంలో విక్రమ్ సరసన నయనతార నిత్యామీనన్ హీరోయిన్స్ గా నటిస్తుండటం విశేషం.

English summary
Vikram's Daughter Akshita is going to get engaged to Manu Ranjith who the son of Chennai-based Clavin Care's Bakery Ranganathan. While the engagement ceremony will happen on July 10th, marriage would take place early next year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu