Just In
- 11 min ago
బాగా మిస్ అవుతోందట.. మళ్లీ దుబాయ్‌కి చెక్కేస్తోన్న కీర్తి సురేష్
- 14 min ago
బాలీవుడ్ కోసం తెలుగు సినిమాలను పక్కన పెట్టేశాడట.. టార్గెట్ మామూలుగా లేదు
- 35 min ago
చిన్న హీరోతో చేయాల్సిన సినిమా స్టార్ హీరో వద్దకు.. మాస్టర్ ప్లాన్
- 56 min ago
రికార్డు క్రియేట్ చేసిన రామ్ చరణ్ వీడియో: టాలీవుడ్లో రెండో టీజర్‌గా ఘనత
Don't Miss!
- Sports
IPL 2021: ముంబై జట్టులో చేరిన పార్థీవ్ పటేల్.. ఆర్సీబీ నిర్ణయంపై సెటైర్స్.!
- News
విషం కలిపిన స్వీట్లు ఇవ్వడం లాంటిదే... మా చుట్టూ వల పన్నే కుట్ర.. : కేంద్రంపై రైతు సంఘాల నేతలు
- Finance
ఢిల్లీలో రికార్డ్ గరిష్టానికి పెట్రోల్ ధరలు, వివిధ నగరాల్లో ధరలు...
- Automobiles
ఇద్దరు కానిస్టేబుళ్లను పొట్టన పెట్టుకున్న బిఎండబ్ల్యు.. ఎలాగో మీరే చూడండి
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'ఐ' విడుదల తేదీ ఖరారు చేస్తూ...(కొత్త పోస్టర్)
హైదరాబాద్: భారీ చిత్రాల దర్శకుడు శంకర్,విక్రమ్ ల కాంబినేషన్ లో రూపొందిన మరో చిత్రం 'ఐ'. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రంలో విక్రమ్, అమీ జాక్సన్ హీరో,హీరోయిన్స్ . ఆస్కార్ ఫిల్మ్స్ పతాకంపై వి.రవిచంద్రన్ నిర్మించారు. ఈ చిత్రం 9 వ తేదీన విడుదల అవుతుందా లేదా అనే సందేహాలు అంతటా ఉన్నాయి. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం తేదీని ఖరారు చేస్తూ పోస్టర్ విడుదల చేసారు. ఈ కొత్త పోస్టర్ చాలా బాగుందని అంతటా ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఈ విడుదల తేదీ విషయాన్ని హీరోయిన్ అమీ జాక్సన్ ట్విట్టర్ లో ఖరారు చేసి ఈ పోస్టర్ ని విడుదల చేసింది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఇక ఈ చిత్రం తమిళ వెర్షన్ ఆడియో ఇప్పటికే విడుదలై మంచిక్రేజ్ తెచ్చుకుంది. తెలుగులోనూ భారీగా రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు, సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపధ్యంలో చిత్రం తెలుగు వెర్షన్ ఆడియోని డిసెంబర్ 30న విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

మెగా సూపర్‌గుడ్ ఫిల్మ్స్ తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సినిమా కొత్త ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. సినిమాలో విక్రమ్ వేసిన గెటప్‌లు, అమీ జాక్సన్ అందచందాలు, విజువల్ ఎఫెక్ట్స్ ఏ స్థాయిలో ఉన్నాయో ఈ ప్రచార చిత్రాలు చూస్తే తెలుస్తోంది. సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలను మరింత పెంచేలా ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. ప్రచార చిత్రం ఆఖరులో హీరోయిన్అమీ జాక్సన్ 'చంపాలనుకుంటున్నావా?' అనడిగితే 'దానికంటే ఎక్కువే చేస్తాను' అంటాడు కురూపి రూపంలో ఉన్న విక్రమ్. మరేం చేయబోతున్నాడో సంక్రాంతికి చూద్దాం.
'ఐ' చిత్రం విషయానికి వస్తే..
విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఐ (తెలుగులో మనోహరుడు) చిత్రం ప్రారంభం నుంచే భారతీయ సినీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోన్న సంగతి తెలసిందే. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం చెన్నైలో విడుదల చేసిన ఈ సినిమా ఆడియో మంచి విజయం సాధించి సినిమాపై మరింత క్రేజ్ క్రియేట్ చేసింది.
విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. రూ.150 కోట్ల పైచిలుకు వ్యయంతో చిత్రాన్ని తెరకెక్కించినట్టు సమాచారం. విదేశీ భాషల్లోనూ చిత్రాన్ని విడుదల చేస్తారు. త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారు.
'ఐ'లో విక్రమ్ సరసన అమీ జాక్సన్ నటించింది. శంకర్ దర్శకత్వం వహించారు. ఎన్.వి.ప్రసాద్, పరాస్‌జైన్ కలిసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఆర్.బి.చౌదరి సమర్పకుడు. ఇటీవలే ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అందులో విక్రమ్ ధరించిన వేషాలు చూసి ప్రేక్షకులు విస్మయానికి గురయ్యారు.
వెండితెరపై సాంకేతిక మాయాజాలాన్ని ప్రదర్శిస్తుంటారు దర్శకుడు శంకర్. ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిని ముగ్ధుడిని చేస్తుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో చిత్రాల్ని తీర్చిదిద్దుతుంటారు. విక్రమ్‌తో తీస్తున్న 'ఐ' కోసం పలు విదేశీ కంపెనీలతో కలసి పని చేస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
దర్శకుడు శంకర్ మాట్లాడుతూ ''ఈ సినిమా కోసం ప్రత్యేకించి పలు హాలీవుడ్ కంపెనీలు పనిచేశాయి. ఆ ప్రతినిధులు షూటింగ్ చూసి ఇలాంటి సినిమాల్లో నటించడం విక్రమ్‌లాంటి నటుడికే సాధ్యమన్నారు. అంత అంకిత భావంతో విక్రమ్ నటించాడు'' అన్నారు.
విక్రమ్ మాట్లాడుతూ ''శంకర్ లాంటి దర్శకుడి చిత్రంలో మళ్లీ నటించడం వరంగా భావిస్తున్నా. ఈ సినిమా ప్రపంచ సినీ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇప్పుడు మీ ముందు కన్పిస్తున్న 'మృగం' వంటి పాత్ర కోసం కనిష్టంగా మూడు గంటల పాటు మేకప్ వేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఎంతో ఓర్పుతో మేకప్ వేసుకుని కెమెరా ముందుకెళ్లాను. ఇలాంటి సినిమాలో నటించడం ఓ సవాలు లాంటిదే. ఇలాంటి మరో నాలుగు పాత్రల్లో సినిమాలో కన్పిస్తాను. ''అన్నారు.
శంకర్, విక్రమ్ సినిమాలకి తమిళం తర్వాత మళ్లీ అదేస్థాయిలో ఫ్యాన్ బేస్, మార్కెట్ వున్న ఏరియా తెలుగు పరిశ్రమ. అందుకే తెలుగు ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించడం కోసం ప్రత్యేకమైన దృష్టిని పెడుతున్నారు.ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ బయిటకు వచ్చి తమిళ ఫిల్మ్ సర్కిల్స్ లో , తమిళ మీడియాలో నలుగుతోంది.
కథేమిటంటే...
ప్రముఖ కండల వీరుడు, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్‌ను ఆదర్శంగా తీసుకొని ప్రపంచ మేటి కండల వీరుడు కావాలనేది లింగేశన్ అనే యువకుడి కల. దీని కోసం ఎంతో కష్టపడతాడు. తన కల నెరవేరుతుందన్న సమయంలో అనుకోకుండా ఓ అడ్డంకి ఎదురవుతుంది. అదేంటి.. దాన్నుంచి ఎలా బయటపడ్డాడు. తన కలను ఎలా నెరవేర్చుకున్నాడు అనే అంశం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'ఐ'. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, ఛాయాగ్రహణం: పీసీ శ్రీరామ్, కూర్పు: ఆంటోని