చిరు లాంచ్ చేసిన విక్రమ్ 'ఇంకొక్కడు' టీజర్, అదిరింది (వీడియో)
హైదరాబాద్: విక్రమ్, నయనతార, నిత్యామేనన్ ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న తమిళ చిత్రం 'ఇరుముగన్'. ఈ సినిమా తెలుగు టైటిల్‌ను సింగపూర్‌లో నిర్వహిస్తున్న సైమా అవార్డుల వేడుకల్లో ప్రకటించారు. 'ఇంకొక్కడు' అనే టైటిల్‌ను తెలుగులో ఖరారు చేశారు. చిరంజీవి చేతుల మీదుగా టీజర్ ని వదిలారు. ఈ టీటర్ ఇప్పుడు సినీ ప్రియులను ఓ రేంజిలో ఆకర్షిస్తోంది. ఈ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ పెంచేస్తోంది.
అరిమా నంబి'తో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు పొందిన ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్ సరసన నయనతార, నిత్యామీనన్ తొలిసారిగా నటిస్తున్నారు. హారిస్ జైరాజ్ స్వరాలందిస్తున్న ఈ చిత్రానికి ఆర్‌డీ రాజశేఖర్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని థమీన్స్ ఫిల్మ్స్ పతాకంపై శిబు థమీన్స్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ చిత్రం తమిళ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే.
ఈ సినిమా తెలుగు టైటిల్, టీజర్‌ను గురువారం సింగపూర్‌లో నిర్వహించే సైమా అవార్డుల వేడుకల్లో చిత్ర బృందం ప్రకటించి, విడుదల చేయనుంది. ఈ విషయాన్ని సైమా తమ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ.. పోస్టర్‌ను పోస్ట్ చేసింది. ఆనంద్‌శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని థమీన్స్ ఫిల్మ్స్ పతాకంపై శిభు థమీన్స్ నిర్మిస్తున్నారు. హారిస్ జయరాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ చిత్రం తమిళ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో విక్రమ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఓ పాత్రలో ఆయన హిజ్రాగా కనిపించనున్నారు. ఈ చిత్ర తెలుగు వర్షన్ హక్కులు రూ.6 కోట్లకు అమ్ముడైనట్లు టాక్. ప్రస్తుతం ఈ చిత్రం చెన్నై లో చిత్రీకరణ జరుపుకుంటోంది.
నాజర్, తంబి రామయ్య, కరుణాకరన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సరైన విజయం లేని విక్రమ్‌కు ఈ సినిమా సక్సెస్ కీలకంగా మారింది. రంజాన్ కానుకగా 'ఇంకొక్కడు' ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











