»   »  ప్రకాష్ రాజ్ విమర్శలు ఎలా ఉన్నా‘ఇంకొక్కడు’ ట్రైలర్‌ అదిరింది (వీడియో)

ప్రకాష్ రాజ్ విమర్శలు ఎలా ఉన్నా‘ఇంకొక్కడు’ ట్రైలర్‌ అదిరింది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో చియాన్ విక్రమ్. ఆయ‌న తాజాగా నటిస్తున్న మరో ఎక్స్ పెరిమెంటల్ యాక్షన్ థ్రిల్లర్ ఇంకొక్కడు. ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం నిర్వహించిన ఆడియో విడుదల వేడుకలో విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో విక్రమ్‌ చాలా ఆసక్తికరమైన పాత్రలో కనిపించారు. మీరూ ఓ లుక్కేయండి.

ఇక ప్రకాష్ రాజ్ రీసెంట్ గా విమర్శలు చేసింది. ఈ ట్రైలర్ తమిళవెర్షన్ లో చూసే. ఈ ట్రైలర్ లో లవ్ అనే హిజ్రా పాత్రలో విక్రమ్ కనపించబోతున్నట్లు అర్దమైంది. ఈ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో సినిమాల్లో హిజ్రాలను విలన్స్ గా చూపించటం తో ఆ వర్గం నుంచి విమర్శలు వస్తున్నాయి.

పాత్రల్ని జుగుప్సాకరంగా చూపిస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మిగతా దివ్యాంగుల లాగే తమ హక్కుల కోసం కూడావాళ్ళు పోరాడుతున్నారు.. ఈ పరిస్థితుల్లో ఒక విలన్ ని హిజ్రా గా చూపించటం వివాదాస్పదమైంది..దానికి సపోర్ట్ గా ప్రకాష్ రాజ్ లాంటి పేరున్న నటుడు ఈ పాత్రల విషయంలో అసంతృప్తి వెళ్లగక్కాడు. సమాజంలోని ఓ వర్గం మనోభావాల్ని దెబ్బ తినేలా ఇలాంటి పాత్రలు రూపొందించడం తప్పని అన్నాడు.

 Vikram's Inkokkadu Official Trailer

ఒకప్పుడు తాను కూడా ఇలాంటి పాత్ర చేయాల్సి వచ్చిందని.. కానీ ఇప్పుడు మాత్రం అది తప్పని అనిపిస్తోందని ప్రకాష్ అన్నాడు. ''అప్పట్లో నేను అప్పు సినిమాలో హిజ్రా విలన్ పాత్ర చేశాను. ఆ పాత్రను అలా ప్రొజెక్ట్ చేయాల్సింది కాదని అప్పట్లో చెప్పాను.ఐతే ఇప్పుడు నేను మరింత సెన్సిటివ్ గా మారాను. అలాంటి పాత్రలు చేయడం తప్పనిపిస్తోంది.

ఇప్పుడు నేను ఒక వ్యక్తిగా ఎదిగాను. పరిణతి సాధించాను. ఇలాంటి పాత్రలు చేయడం కరెక్ట్ కాదు.సినిమా రూపకర్తలు సమాజంపై చాలా ప్రభావం చూపిస్తారు. తమ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది. కానీ అందులో బాధ్యత ఉండాలి. ఇలాంటి పాత్రలు సమాజం వేరే కొంత ప్రతికూల ప్రభావం చూపిస్తాయి'' అని ప్రకాష్ అన్నాడు.

నయనతార, నిత్యామేనన్‌ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. విక్రమ్‌ ఇందులో ద్విపాత్రాభినయంలో నటించినట్లు తెలుస్తోంది. ఆనంద్‌శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని థమీన్స్‌ ఫిల్మ్స్‌ పతాకంపై శిభు థమీన్స్‌ నిర్మిస్తున్నారు. హరిస్‌ జయరాజ్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

English summary
The Telugu trailer of Tamil star Vikram’s upcoming thriller, Iru Mugan, was unveiled at the audio function last night. The trailer received a thumping response from the guests and fans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu