For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సిక్స్ ప్యాక్ తో స్టార్ హీరో సెల్ఫీ(ఫొటో)

  By Srikanya
  |

  హైదరాబాద్ : సిక్స్ ప్యాక్ తో యంగ్ హీరోలు వెండితెరపై అదరకొడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ 48 సంవత్సరాల వయస్సులో సిక్స్ ప్యా్క్ సాధించి ఇలా సెల్ఫీ తీసుకుని మన ముందు పెట్టారు విక్రమ్. ఆయన తాజా చిత్రం ఐ కోసం ఇలా సిక్స్ ప్యాక్ ని సాధించినట్లు చెప్తున్నారు. ఆయన డెడికేషనే ఈ సినిమాకు ప్రాణం అని దర్శకుడు కితాబు ఇస్తున్నారు.

  'ఐ' చిత్రం విషయానికి వస్తే..

  విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఐ (తెలుగులో మనోహరుడు) చిత్రం ప్రారంభం నుంచే భారతీయ సినీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోన్న సంగతి తెలసిందే. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం చెన్నైలో విడుదల చేసిన ఈ సినిమా ఆడియో మంచి విజయం సాధించి సినిమాపై మరింత క్రేజ్ క్రియేట్ చేసింది.

  విజువల్‌ వండర్‌గా తీర్చిదిద్దుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. రూ.150 కోట్ల పైచిలుకు వ్యయంతో చిత్రాన్ని తెరకెక్కించినట్టు సమాచారం. విదేశీ భాషల్లోనూ చిత్రాన్ని విడుదల చేస్తారు. త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారు.

  'ఐ'లో విక్రమ్‌ సరసన అమీ జాక్సన్‌ నటించింది. శంకర్‌ దర్శకత్వం వహించారు. ఎన్‌.వి.ప్రసాద్‌, పరాస్‌జైన్‌ కలిసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఆర్‌.బి.చౌదరి సమర్పకుడు. ఇటీవలే ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అందులో విక్రమ్‌ ధరించిన వేషాలు చూసి ప్రేక్షకులు విస్మయానికి గురయ్యారు.

  వెండితెరపై సాంకేతిక మాయాజాలాన్ని ప్రదర్శిస్తుంటారు దర్శకుడు శంకర్‌. ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిని ముగ్ధుడిని చేస్తుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో చిత్రాల్ని తీర్చిదిద్దుతుంటారు. విక్రమ్‌తో తీస్తున్న 'ఐ' కోసం పలు విదేశీ కంపెనీలతో కలసి పని చేస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

  Vikram's Six Pack selfie!

  దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ ''ఈ సినిమా కోసం ప్రత్యేకించి పలు హాలీవుడ్‌ కంపెనీలు పనిచేశాయి. ఆ ప్రతినిధులు షూటింగ్‌ చూసి ఇలాంటి సినిమాల్లో నటించడం విక్రమ్‌లాంటి నటుడికే సాధ్యమన్నారు. అంత అంకిత భావంతో విక్రమ్‌ నటించాడు'' అన్నారు.

  విక్రమ్‌ మాట్లాడుతూ ''శంకర్‌ లాంటి దర్శకుడి చిత్రంలో మళ్లీ నటించడం వరంగా భావిస్తున్నా. ఈ సినిమా ప్రపంచ సినీ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇప్పుడు మీ ముందు కన్పిస్తున్న 'మృగం' వంటి పాత్ర కోసం కనిష్టంగా మూడు గంటల పాటు మేకప్‌ వేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఎంతో ఓర్పుతో మేకప్‌ వేసుకుని కెమెరా ముందుకెళ్లాను. ఇలాంటి సినిమాలో నటించడం ఓ సవాలు లాంటిదే. ఇలాంటి మరో నాలుగు పాత్రల్లో సినిమాలో కన్పిస్తాను. ''అన్నారు.

  శంకర్, విక్రమ్ సినిమాలకి తమిళం తర్వాత మళ్లీ అదేస్థాయిలో ఫ్యాన్ బేస్, మార్కెట్ వున్న ఏరియా తెలుగు పరిశ్రమ. అందుకే తెలుగు ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించడం కోసం ప్రత్యేకమైన దృష్టిని పెడుతున్నారు.ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ బయిటకు వచ్చి తమిళ ఫిల్మ్ సర్కిల్స్ లో , తమిళ మీడియాలో నలుగుతోంది.

  కథేమిటంటే...

  ప్రముఖ కండల వీరుడు, హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగ్గర్‌ను ఆదర్శంగా తీసుకొని ప్రపంచ మేటి కండల వీరుడు కావాలనేది లింగేశన్‌ అనే యువకుడి కల. దీని కోసం ఎంతో కష్టపడతాడు. తన కల నెరవేరుతుందన్న సమయంలో అనుకోకుండా ఓ అడ్డంకి ఎదురవుతుంది. అదేంటి.. దాన్నుంచి ఎలా బయటపడ్డాడు. తన కలను ఎలా నెరవేర్చుకున్నాడు అనే అంశం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'ఐ'.

  English summary
  Vikram appears as Youth who possess six pack abs for few portions of I movie. The versatile actor himself shot a selfie and shared it to thrill everyone.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X