Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హీరో విక్రమ్ చిన్నప్పుడు ఇలా...(ఫొటో)
హైదరాబాద్ : విక్రమ్, శంకర్ ల భారీ చిత్రం 'ఐ' . ఈ చిత్రం రిలిజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 9న ఈ చిత్రం విడుదల చేస్తామని తేదీని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం హీరో విక్రమ్...చిన్నప్పుడు ఫొటో బయిటకు వచ్చింది. బాక్సింగ్ చేస్తూ ఉన్న ఈ ఫొటో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. మీరూ ఓ లుక్కేయండి.
https://www.facebook.com/TeluguFilmibeat
'ఐ'లో విక్రమ్ సరసన అమీ జాక్సన్ నటించింది. శంకర్ దర్శకత్వం వహించారు. ఎన్.వి.ప్రసాద్, పరాస్‌జైన్ కలిసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఆర్.బి.చౌదరి సమర్పకుడు. ప్రచార చిత్రంలో విక్రమ్ ధరించిన వేషాలు చూసి ప్రేక్షకులు విస్మయానికి గురయ్యారు. విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. రూ.150 కోట్ల పైచిలుకు వ్యయంతో చిత్రాన్ని తెరకెక్కించినట్టు సమాచారం. విదేశీ భాషల్లోనూ చిత్రాన్ని విడుదల చేస్తారు.

వెండితెరపై సాంకేతిక మాయాజాలాన్ని ప్రదర్శిస్తుంటారు దర్శకుడు శంకర్. ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిని ముగ్ధుడిని చేస్తుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో చిత్రాల్ని తీర్చిదిద్దుతుంటారు. విక్రమ్‌తో తీస్తున్న 'ఐ' కోసం పలు విదేశీ కంపెనీలతో కలసి పని చేస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
దర్శకుడు శంకర్ మాట్లాడుతూ ''ఈ సినిమా కోసం ప్రత్యేకించి పలు హాలీవుడ్ కంపెనీలు పనిచేశాయి. ఆ ప్రతినిధులు షూటింగ్ చూసి ఇలాంటి సినిమాల్లో నటించడం విక్రమ్‌లాంటి నటుడికే సాధ్యమన్నారు. అంత అంకిత భావంతో విక్రమ్ నటించాడు'' అన్నారు.
విక్రమ్ మాట్లాడుతూ ''శంకర్ లాంటి దర్శకుడి చిత్రంలో మళ్లీ నటించడం వరంగా భావిస్తున్నా. ఈ సినిమా ప్రపంచ సినీ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇప్పుడు మీ ముందు కన్పిస్తున్న 'మృగం' వంటి పాత్ర కోసం కనిష్టంగా మూడు గంటల పాటు మేకప్ వేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఎంతో ఓర్పుతో మేకప్ వేసుకుని కెమెరా ముందుకెళ్లాను. ఇలాంటి సినిమాలో నటించడం ఓ సవాలు లాంటిదే. ఇలాంటి మరో నాలుగు పాత్రల్లో సినిమాలో కన్పిస్తాను. ''అన్నారు.
శంకర్, విక్రమ్ సినిమాలకి తమిళం తర్వాత మళ్లీ అదేస్థాయిలో ఫ్యాన్ బేస్, మార్కెట్ వున్న ఏరియా తెలుగు పరిశ్రమ. అందుకే తెలుగు ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించడం కోసం ప్రత్యేకమైన దృష్టిని పెడుతున్నారు.ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ బయిటకు వచ్చి తమిళ ఫిల్మ్ సర్కిల్స్ లో , తమిళ మీడియాలో నలుగుతోంది.
కథేమిటంటే...
ప్రముఖ కండల వీరుడు, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్‌ను ఆదర్శంగా తీసుకొని ప్రపంచ మేటి కండల వీరుడు కావాలనేది లింగేశన్ అనే యువకుడి కల. దీని కోసం ఎంతో కష్టపడతాడు. తన కల నెరవేరుతుందన్న సమయంలో అనుకోకుండా ఓ అడ్డంకి ఎదురవుతుంది. అదేంటి.. దాన్నుంచి ఎలా బయటపడ్డాడు. తన కలను ఎలా నెరవేర్చుకున్నాడు అనే అంశం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'ఐ'.