»   » శంకర్ దర్శకత్వంలో....హీరో విక్రమ్ షాకింగ్ లుక్

శంకర్ దర్శకత్వంలో....హీరో విక్రమ్ షాకింగ్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'అపరిచితుడు' లాంటి హిట్ తర్వాత హీరో విక్రమ్-ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'మనోహరుడు'. తమిళంలో 'ఐ' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో 'మనోహరుడు'గా విడుదల చేయనున్నారు.

ఈ చిత్రంలో విక్రమ్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. ఎంత సరికొత్తగా అంటే......అభిమానులు షాకయ్యేలా బక్కచిక్కిపోయి దర్శనం ఇవ్వనున్నాడు. తాజాగా విడుదలైన విక్రమ్ న్యూ లుక్‌ అభిమానులను ఉలిక్కిపడేలా చేసింది. అయితే దర్శకుడు శంకర్ మాత్రం సినిమా పాత్రకు సూటయ్యేందుకు ఇలాంటి లుక్ అంటున్నాడు.

సినిమాకు సంబంధించిన ఇతర వివరాల్లోకి వెళితే....ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 17 భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహించిన రోబోను 9 భాషల్లో విడుదల చేశారు. ఇప్పుడు రజనీకాంత్ నటిస్తున్న కోచ్చడయాన్ ను 15 భాషల్లో విడుదల చేస్తున్నారు. ఆ సినిమాను మించి తన ఐను 17 భాషల్లో విడుదల చేయడానికి శంకర్ ప్లాన్ చేస్తున్నారట.

ఆస్కార్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. బాడీ షేపింగ్, స్కానింగ్, మేకప్ లాంటి చాలా విషయాలకు ఎక్కువ సమయం తీసుకుంటోందట. విక్రమ్ ఈ సినిమా కోసం గతంలో ఏ సినిమాకూ లేని విధంగా చాలా ఎక్కువ శ్రమ పడుతున్నారట.

ఈ చిత్రంలో విక్రమ్ సరసన అమీ జాక్సన్ హరోయిన్. ప్రముఖ సంగీత దర్శకడు రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసారు. పీసీ శ్రీరామ్ కెమెరామేన్. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేస్తారు. శుభతో కలిసి శంకర్ కూడా కథను రాశారు. భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రానున్న ఈ సినిమాను అంతే అపురూపంగా నెక్స్ట్ లెవల్ సినిమాగా తీర్చిదిద్దుతున్నారట శంకర్.

English summary
Have a close look at the shocking new avatar of the versatile hero Vikram for his multi-lingual project 'Manoharudu', Ai in Tamil, which is currently under production. Earlier, director Shankar has informed that the film's making is taking more than a year as Vikram's look is taking time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu