twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీ 'విక్రమసింహా' ఆడియో తేదీ ఖరారు

    By Srikanya
    |

    హైదరాబాద్ : రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'కోచ్చడయాన్‌'. దీపికా పదుకొణే హీరోయిన్. రజనీ తన సౌందర్య అశ్విన్‌ దర్శకత్వం వహిస్తోంది. సునీల్‌ లుల్లా నిర్మాత. ఈ సినిమాని తెలుగులో 'విక్రమసింహా'గా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం పాటల విడుదల వేడుక వచ్చే నెల 10న హైదరాబాద్‌లో నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

    తమిళ వెర్షన్‌ పాటల వేడుక చెన్నైలో ఒకరోజు ముందుగానే అంటే వచ్చే నెల 9నే జరుగనుందని కోలీవుడ్‌ సమాచారం. పెర్‌ఫార్మెన్స్‌ మోషన్‌ క్యాప్చరింగ్‌ విధానంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తెలుగు వెర్షన్ తోపాటు హిందీ, మరాఠి, భోజ్‌పురి, బెంగాలీ, పంజాబీ, ఇంగ్లిష్‌ల్లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రంలో శరత్‌కుమార్, జాకీ ష్రాఫ్, ఆది పినిశెట్టి, శోభన, నాజర్ వంటి పేరుపొందిన తారలు నటిస్తున్నారు.

    కె.ఎస్. రవికుమార్ రచన చేయగా, ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి రాజీవ్ మీనన్ సినిమాటోగ్రాఫర్. తెలుగులో లక్ష్మీగణపతి ఫిలిమ్స్ విడుదల చేస్తున్న ఈ సినిమాని హిందీ, మలయాళం, ఇంగ్లీష్, జపనీస్ భాషల్లోనూ అనువదిస్తున్నారు. 'రోబో' తర్వాత రజనీకాంత్‌ హీరోగా 'రాణా' చిత్రం తెరకెక్కాల్సింది. ఆయన అనారోగ్యానికి గురికావటంతో అది ఆగిపోయింది. తన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 'కోచ్చడయాన్‌'కు పచ్చజెండా వూపి అభిమానులను ఖుషీ చేశారు సూపర్‌స్టార్‌. సీనియర్‌ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ పర్యవేక్షణలో అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిందీ చిత్రం.

    ఇందులో రాణా, కోచ్చడయాన్‌గా రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేశారు. 'విక్రమ్ సింహా' చిత్రంలో రజనీకాంత్..రణధీరన్‌ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్‌ మీనన్‌ కెమెరా వర్క్ అందిస్తున్నారు. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే. భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

    English summary
    Rajinikanth's much awaited film ‘Vikram Simha’ finally fixed its audio release date. According to sources filmmakers who are planning to release the film in a grand manner on April ,are now getting ready to release the film's audio on March 10th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X