»   » తండ్రి నమ్మకాన్ని నిలబెట్టేలా..అర్జున్ రెడ్డి గెటప్‌లో విక్రమ్ కొడుకుని చూస్తే షాకే!

తండ్రి నమ్మకాన్ని నిలబెట్టేలా..అర్జున్ రెడ్డి గెటప్‌లో విక్రమ్ కొడుకుని చూస్తే షాకే!

Subscribe to Filmibeat Telugu
Arjun Reddy Mania Again అర్జున్ రెడ్డి లుక్ లో

గత ఏడాది అర్జున్ రెడ్డి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద చేసిన సందడి అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో జాతీయ వ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్ గా ఈ చిత్రం మారింది. బాలీవుడ్, కోలీవుడ్ నిర్మాతలు ఈ చిత్ర రీమేక్ హక్కుల కోసం ఎగబడ్డారు. డెబ్యూ డైరెక్టర్ సందీప్ వంగ తొలి చిత్రంతోనే అద్భుతం చేసాడు. ఇప్పడు అతడితో సినిమా చేయడానికి టాలీవడ్ పెద్ద స్టార్లు ఆసక్తి చూపిస్తున్నారు. అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ దేవర కొండా నటన ఆశ్చర్యపరిచింది. కాగా ఈ చిత్రాన్ని తమిళంలో స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ధృవ్ క్రమంగా అర్జున్ రెడ్డి గెటప్ లోకి మారిపోతూ ఆశ్చర్యపరుస్తున్నాడు.

 టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన అర్జున్ రెడ్డి

టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన అర్జున్ రెడ్డి

అర్జున్ రెడ్డి చిత్రం విడుదలైన తరువాత సంచనల విజయం సాధించింది. చిన్న చిత్రం గా బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చిన ఈ చిత్రం యునానిమస్ టాక్ తో పెద్ద హిట్ సాధించింది.

వివాదాలు చుట్టుముట్టినా

వివాదాలు చుట్టుముట్టినా

ఈ చిత్రాన్ని వివాదాలు చుట్టుముట్టినా వాటన్నింటిని తట్టుకుని ఘనవిజయం సాధించడం విశేషం.

రీమేక్ హక్కుల కోసం

రీమేక్ హక్కుల కోసం

ఈ చిత్రం సాధించిన విజయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దీనితో పలు భాషల నిర్మాతలంతా రీమేక్ హక్కుల కోసం ఎగబడ్డారు.

 విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా

విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా

తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. తమిళ దర్శకుడు బాల ఈ చిత్రానికి తెరకెక్కిస్తున్నారు. వర్మ అనే టైటిల్ తో ఈ చిత్రం రాబోతోంది.

అర్జున్ రెడ్డి లుక్ లో అదిరిపోయాడు

ధృవ్ డెబ్యూ మూవీ ఇదే. అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ దేవర కొండా గడ్డం లుక్ లో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కూడా ధృవ్ గడ్డం లుక్ లో కనిపించనున్నాడు. రీసెంట్ గా విక్రమ్ తన కుమారుడు లేటెస్ట్ లుక్ ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. గడ్డం లుక్ లో ధృవ్ అబ్బురపరిచే విధంగా మారిపోయాడు.

రెండేళ్ల తరువాతే అనుకున్నాడట

రెండేళ్ల తరువాతే అనుకున్నాడట

తన కొడుకు ధృవ్ ని మరో రెండేళ్ల తరువాతే సినిమాల్లోకి లాంచ్ చేయాలనీ తాను భావించానని ఇటీవల విక్రమ్ తెలిపాడు. కానీ అర్జున్ రెడ్డి చిత్రం చూసాక తన కుమారుడిని లాంచ్ చేయడానికి ఇదే సరైన చిత్రం అని భావించానని విక్రమ్ తెలిపాడు.

ఆయన్ని రిక్వస్ట్ చేశా

ఆయన్ని రిక్వస్ట్ చేశా

ఈ చిత్రానికి దర్శకత్వం వహించవలసిందిగా ప్రముఖ దర్శకుడు బాలని తానే రిక్వస్ట్ చేసి ఒప్పించినట్లు విక్రమ్ తెలిపాడు.

 తండ్రి నమ్మకాన్ని నిలబెట్టేలా

తండ్రి నమ్మకాన్ని నిలబెట్టేలా

విక్రమ్ ని రీసెంట్ గా గడ్డం లుక్ లో చూసిన వారంతా తండ్రి పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేలా ఉన్నాడని కితాబు ఇస్తున్నారు. చూద్దాం వర్మ పాత్రలో ధృవ్ నటన ఎలా ఉంటుందో!

English summary
Vikram son Dhruv stunning look in Arjun Reddy getup. Vikram shares photo in social media
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu