»   » ‘నాన్న’కు ప్రమోషన్ మొదలెట్టిన విక్రమ్...!

‘నాన్న’కు ప్రమోషన్ మొదలెట్టిన విక్రమ్...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మూడు రోజుల క్రితం విడుదలైన 'నాన్న' సినిమాకి క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూలు వచ్చాయి. సినిమా బాగుందంటూ చూసిన వాళ్లు కూడా మెచ్చుకుంటున్నారు. మనిషి ఎదిగినా మనసు మాత్రం ఐదు సంవత్సరాల వయసు దగ్గరే ఆగిపోయిన పిల్లాడిగా హీరో విక్రం నటన అదుర్స్ అంటూ ప్రశంసిస్తున్నారు. అయితే, కలెక్షన్లు మాత్రం డల్ గా ఉండడంతో చిత్ర నిర్మాతలు పెద్ద ఎత్తున ప్రమోషన్ స్టార్ట్ చేశారు. విక్రం ఓ తమిళ సినిమా షూటింగ్ నిమిత్తం దుబాయ్ లో ఉన్నప్పటికీ, అతన్ని హైదరాబాదుకి రప్పించి మరీ టీవీ ఇంటర్వ్యూలు ఇప్పుస్తున్నారు. అలాగే, హీరో విక్రం, హీరోయిన్ అనుష్క, చైల్డ్ ఆర్టిస్ట్ సారా తదితరులతో హైదరాబాదులో ఆ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లను సందర్శించారు. విక్రం ప్రేక్షకులతో తెలుగులో మాట్లాడుతూ, సినిమాలోని తన అభినయాన్ని అనుకరిస్తూ వారిని ఎంటర్ టైన్ చేశాడు. నిర్మాతలు ఈ సినిమాపై నాలుగు కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

మూవీ ప్రమోషన్‌లో భాగంగా దర్శకనిర్మాతలు, నటీనటులు హైదరాబాద్‌లోని పలు థియేటర్లలో ప్రేక్షకులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా విక్రమ్‌ మాట్లాడుతూ...'మంచి చిత్రాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ముందుంటారు. గతంలోనూ నేను నటించిన చిత్రాలు ఇక్కడ బాగా ఆడాయి. 'నాన్న' విజయాన్ని నేను ఊహించాను. కాని దర్శకుడు విజరు మాత్రం కొంచెం భయపడ్డాడు. ఇప్పుడు మీ ఆనందాన్ని చూస్తే ఆయనతో బాటు మా యూనిట్‌ అంతా సంతోషంగా ఉన్నాం' అన్నారు.

అనుష్క మాట్లాడుతూ...'నా కెరీర్‌లో మరిచిపోలేని పాత్ర పోషించాను. విక్రమ్‌, సారా చూపిన నటన రియల్లీ సూపర్బ్‌' అన్నారు. సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్‌ మాట్లాడుతూ... 'దర్శకుడు విజరుతో ఇది మూడవ సినిమా' అన్నారు. దర్శకుడు విజరు మాట్లాడుతూ... 'నాన్న'ని ఇంతలా ఆదరిస్తారని కలలో కూడా ఊహించలేదు. మీ ఆదరాభిమానాలను చూస్తుంటే తెలుగులో స్ట్రెయిట్‌ చిత్రం చేయాలని పిస్తోంది. చిత్రాన్ని విడుదల చేసిన నిర్మాతలకు కృతజ్ఞతలు' అన్నారు.

English summary
Tamil actor Vikram do not want to promote his movie ‘Nanna’, rather he just want to wait and see how the movie runs in Tollywood and how people will like the movie in AP. Nanna is a dubbed version of Tamil film 'Deiva Thirumagal'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu