»   » అఫీషియల్: రజనీ 'విక్రమసింహా' విడుదల తేదీ

అఫీషియల్: రజనీ 'విక్రమసింహా' విడుదల తేదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్‌ నటిస్తున్న తమిళ చిత్రం 'విక్రమసింహా' ('కోచ్చడయాన్‌') థియోటర్స్ లో దూకటానికి ముహూర్తం కుదిరింది. ఏప్రిల్‌ 11న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. పెర్‌ఫార్మెన్స్‌ మోషన్‌ క్యాప్చర్‌ విధానంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి రజనీ కుమార్తె సౌందర్య దర్శకురాలు.

రజనీ సరసన దీపికా పదుకొణే నటిస్తున్న 'కోచ్చడయాన్‌' చిత్రానికి సునీల్‌ లుల్ల నిర్మాత. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతమందిస్తున్నారు. తెలుగులో 'విక్రమసింహా'గా ఈ సినిమాని విడుదల చేస్తారు. దీంతోపాటు హిందీ, మరాఠి, భోజ్‌పురి, బెంగాలీ, పంజాబీ, ఇంగ్లిష్‌ల్లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

Vikrama Simha confirmed for Apr 11


ఈ చిత్రంలో శరత్‌కుమార్, జాకీ ష్రాఫ్, ఆది పినిశెట్టి, శోభన, నాజర్ వంటి పేరుపొందిన తారలు నటిస్తున్నారు. ఈ సినిమాని 'అవతార్' తరహాలో మోషన్ కాప్చర్ 3డి టెక్నాలజీని ఉపయోగించి చిత్రీకరించారు. కె.ఎస్. రవికుమార్ రచన చేయగా, ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి రాజీవ్ మీనన్ సినిమాటోగ్రాఫర్. తెలుగులో లక్ష్మీగణపతి ఫిలిమ్స్ విడుదల చేస్తున్న ఈ సినిమాని హిందీ, మలయాళం, ఇంగ్లీష్, జపనీస్ భాషల్లోనూ అనువదిస్తున్నారు.

'రోబో' తర్వాత రజనీకాంత్‌ హీరోగా 'రాణా' చిత్రం తెరకెక్కాల్సింది. ఆయన అనారోగ్యానికి గురికావటంతో అది ఆగిపోయింది. తన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 'కోచ్చడయాన్‌'కు పచ్చజెండా వూపి అభిమానులను ఖుషీ చేశారు సూపర్‌స్టార్‌. సీనియర్‌ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ పర్యవేక్షణలో అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిందీ చిత్రం. ఇందులో రాణా, కోచ్చడయాన్‌గా రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పటికే ట్రైలర్‌ విడుదల చేశారు.

రజనీకాంత్ నటించిన చివరి చిత్రం 'రోబో' 2010లో విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన సినిమా విడుదల కాలేదు. దీంతో అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన రజనీకాంత్, దర్శకురాలు సౌందర్య 'కొచ్చాడయాన్' చిత్రాన్ని ఈ దీపావళికి విడుదల చేస్తామని అభిమానులకు మాటిచ్చారు. కానీ ఫలితం లేదు. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా చాలా పెండింగులో ఉంది. ఈ నేపథ్యంలో కొచ్చాడయాన్ చిత్రం విడుదల లేటవుతూ వచ్చింది.

'విక్రమ్ సింహా' చిత్రంలో రజనీకాంత్..రణధీరన్‌ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్‌ మీనన్‌ కెమెరా వర్క్ అందిస్తున్నారు. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే. భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

English summary

 
 As per the latest official statement Vikrama Simha will release on April 11. The film will release worldwide on April 11th in 8 languages including Tamil, Telugu, Hindi and English simultaneously.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu