»   » 'విక్రమ్ సింహా‌' రేపు...ఈ రోజుకి ఈ వీడియో

'విక్రమ్ సింహా‌' రేపు...ఈ రోజుకి ఈ వీడియో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పెర్‌ఫార్మన్స్‌ మోషన్‌ క్యాప్చరింగ్‌ విధానంలో తెరకెక్కిన 'విక్రమ్ సింహా‌' రేపు విడుదయ్యి...రజనీ అభిమానులకు ఆనందం చేకూర్చనుంది. ఈ లోగా ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మనసాయారా అనే పాటను విడుదల చేసారు. ఆ పాట వీడియో ఇదిగో...

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/o89EqStLKMU?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

ఈ సినిమాలో రజనీ సరసన దీపికా పదుకొణే నటించింది. రజనీ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించారు. సునీల్‌ లుల్ల నిర్మాత. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరపరచిన పాటల్ని రీసెంట్ గా విడుదలయ్యాయి. 'రోబో' తర్వాత రజనీకాంత్‌ హీరోగా 'రాణా' చిత్రం తెరకెక్కాల్సింది. ఆయన అనారోగ్యానికి గురికావటంతో అది ఆగిపోయింది. తన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 'కోచ్చడయాన్‌'కు పచ్చజెండా వూపి అభిమానులను ఖుషీ చేశారు సూపర్‌స్టార్‌. సీనియర్‌ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ పర్యవేక్షణలో అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిందీ చిత్రం. ఇందులో రాణా, కోచ్చడయాన్‌గా రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేశారు.


అందరూ అనుకుంటున్న కారణాలేమోగానీ.. త్రీడీ టెక్నాలజీకి మార్చుతుండటంతోనే 'విక్రమ్ సింహా‌' విడుదలలో జాప్యం చోటుచేసుకుంటోందని ఆ చిత్ర దర్శకురాలు సౌందర్య పేర్కొన్నారు. ఆమె తన తండ్రి రజనీకాంత్‌ ద్విపాత్రల్లో నటించిన 'కోచ్చడయాన్‌'ను తెరకెక్కించారు. ఇప్పటి వరకు ఆరుసార్లు ఈ చిత్ర విడుదల వాయిదా పడింది. వాస్తవానికి క్రిందటి నెల 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అధికారికంగా ప్రకటించారు. చివరి క్షణంలో ఈ తేదీని ఈ నెల 23కి మార్చారు.

Vikramasimha - Manasaayera Song Promo

సౌందర్య మాట్లాడుతూ..... '' అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిన ఈ చిత్రాన్ని త్రీడీ సాంకేతిక పరిజ్ఞానంలోకి కూడా మారుస్తున్నాం. దీంతో విడుదలలో జాప్యం చోటుచేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 23న ప్రేక్షకుల ముందుకు తెస్తాం. మా చిత్రాన్ని వారు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. తెలుగులో 'విక్రమసింహా' పేరుతో విడుదల కానున్న ఈ చిత్రానికి అక్కడ యూ ధ్రువపత్రం వచ్చింది'' అని పేర్కొంది.


'విక్రమ్ సింహా' చిత్రంలో రజనీకాంత్..రణధీరన్‌ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్‌ మీనన్‌ కెమెరా వర్క్ అందిస్తున్నారు.
ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే. భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

English summary
Watch Medhuvaagathaan Official Song Promo from the Movie Vikramasimha.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu