twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీ ‘లింగా’ షూటింగ్ అడ్డుకున్న రంగారెడ్డి జిల్లా వాసులు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అనాజ్ పూర్ విలేజికి చెందిన వారు రజనీకాంత్ 'లింగా' షూటింగును అడ్డుకునే ప్రయత్నం చేసారు. రామోజీఫిల్మ్ సిటీ సమీపంలో ఈ విలేజ్ ఉంది. షూటింగ్ సమయంలో సమీపంలోని చెరువులో కెమికల్స్ కలుపుతూ నీటిని కలుషితం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. తాము ఇరిగేషన్ డిపార్టుమెంట్, గ్రామ పంచాయితీ నుండి అనుమతి తీసుకున్నామని మూవీ యూనిట్ సభ్యులు స్పష్టం చేసారు. గతంలోనూ ఈ గ్రామస్తులు బాహుబలి షూటింగును అడ్డుకునే ప్రయత్నం చేసారు.

    Villagers try to stop Rajinikanth's 'Lingaa' shooting

    'లింగా' సినిమా విషయానికొస్తే...

    రజనీకాంత్‌ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం 'లింగా' . కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్కతో పాటు సోనాక్షి సిన్హా కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ చిత్రంలో విలన్ గా ఇప్పటికే జగపతిబాబు ఉండగా, మరొక విలన్ గా దేవగిల్ నటిస్తున్నారని సమాచారం. ఇండిపెండెన్స్ కు ముందు జరిగే ఫ్లాష్ బ్యాక్ లో దేవగిల్ కనిపిస్తారని చెప్తున్నారు.

    'లింగా'కు రత్నవేలు కెమెరాను నిర్వహిస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. బ్రిటిష్ నటి లారెన్ జె ఇర్విన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఆయన ఈ చిత్రంలో రెండు పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం.ఈ చిత్ర కథ ప్రస్తుతం కొంత, ప్లాష్‌బ్యాక్‌లో కొంత ఉంటుంది. ప్రస్తుత కథలో జిల్లా కలెక్టర్‌గా ప్లాష్‌బ్యాక్‌ నేపథ్యంలో ఓ వైవిధ్యమైన పాత్రలోనూ ఆయన కనిపించనున్నట్లు తెలుస్తోంది. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. ఈ సినిమాలో నయనతార ప్రత్యేక గీతంలో నర్తించనుందని సమాచారం.

    English summary
    Some villagers of Anajpur village in Rangareddy district have tried to stop the shooting of Rajinikanth's 'Lingaa'. The villagers have alleged that some chemicals are being mixed in the lake there during shoots and the water is getting polluted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X