»   » దత్తత గ్రామాన్ని మరిచిపోయిన మహేష్ బాబు!

దత్తత గ్రామాన్ని మరిచిపోయిన మహేష్ బాబు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ శ్రీమంతుడు చిత్రం తర్వాత రెండు గ్రామాలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ శ్రీమంతుడు విడుదలై నేటితో సిల్వర్ జూబ్లీ(175 రోజులు) కూడా పూర్తి చేసుకుంది. మరికొన్ని రోజుల్లో ఈ చిత్రం విడుదలై 200 రోజులు పూర్తి చేసుకోబోతోంది.

అప్పుడు మహేష్ బాబు చేసిన హడావుడి ప్రజలకు ఏదైనా చేయాలనే తపనతోనా...? లేక తన సినిమా పబ్లిసిటీకోసమా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మహేష్ బాబు దత్తత తీసుకున్న గ్రామాల ప్రజలు మహేష్‌పై తీరుపై అసహనంగా ఉన్నారనే వార్తలు మీడియాలో వినిపిస్తున్నాయి.

Villagers unhappiness about Mahesh Babu Adoption

గతంలో సిద్ధాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేష్ ఆ గ్రామానికి రావడం కాని, కనీసం వారి బాగోగులు కూడా పట్టించుకోవడం లేదని సిద్దాపూర్ గ్రామస్థులు ఆయనపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ మా గ్రామానికి ఎప్పుడు వస్తారు, మా జీవితాలను ఎప్పుడు బాగు చేస్తారు అని అక్కడి వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారనే వార్తలు ప్రముఖ పత్రికల్లో రావడం గమనర్హం.

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకాలపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మించిన హోల్‌సమ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'శ్రీమంతుడు'. ఈ చిత్రం విడుదలైన అన్ని సెంటర్లలో హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలవడమే కాకుండా 100 కోట్ల షేర్‌ సాధించి సూపర్‌స్టార్‌ మహేష్‌ చిత్రాల్లో రికార్డ్‌ సృష్టించింది. 15 సెంటర్స్‌లో 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేటి(28 జనవరి)తో సిల్వర్‌ జూబ్లీ పూర్తి చేసుకోబోతోంది. ఎమ్మిగనూరు - లక్ష్మణ్‌ థియేటర్‌లో డైరెక్ట్‌గా 175 రోజులు పూర్తి చేసుకోబోతోంది.

English summary
Villagers have expressed their Unhappiness over Mahesh Babu Adoption.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu