For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ లైవ్: పవన్ కల్యాణ్‌తో ఆ కోరిక తీరలేదు. కానీ రాంచరణ్‌తో..

  |

  రంగస్థలం సెన్సేషనల్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన చిత్రం వినయ విధేయ రామ. ఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ బోయపాటి శ్రీను. దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 28న రిలీజ్ కానున్నది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటులు చలపతి రావు, సీనియర్ హీరోయిన్ స్నేహ, క్యారెక్టర్‌ ఆర్టిస్టులు హేమ, ప్రవీణ, తదితరులు హాజరయ్యారు.

   చరణ్ వేసిన స్టెప్పులకు రేపు థియేటర్లో అంతా ఊగిపోతారు: దేవిశ్రీ ప్రసాద్

  చరణ్ వేసిన స్టెప్పులకు రేపు థియేటర్లో అంతా ఊగిపోతారు: దేవిశ్రీ ప్రసాద్

  ఈ సందర్బంగా దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ... మెగాస్టార్ గారి ఫ్యాన్స్‌ను లైన్లో నిలబెడితే మొదటి వరుసలో నేనూ ఉంటాను. చిరంజీవి గారు ఎక్కడున్నా ఫుల్ హుషారు వచ్చేస్తుంది. త్రివిక్రమ్ గారు చెప్పినట్లు మమ్మల్ని నడిపించేది ఆయనే. ఎంతో మందికి ఆయన ఇన్స్‌స్పిరేషన్. నా కెరీర్ మొదటి నుంచి ఎంకరేజ్ చేశారు. నాలాగే టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరినీ ఎంకరేజ్ చేస్తారు. రామ్ చరణ్ నాకు సోదరుడు లాంటివాడు. చిరంజీవి డాన్స్ గురించి అంతా మాకు తెలుసు. సినిమా రీ రికార్డింగ్ చేస్తున్నపుడు నేను చరణ్ కు సాంగ్ చేస్తున్నా కూడా చిరంజీవిగారిని ఊహించుకుని చేస్తాను. ఈ సినిమాలో తస్సాదియ్యా సాంగ్ చూసినపుడు చాలా ఎగ్టైట్ అయ్యాను. చరణ్ వేసిన స్టెప్పులకు రేపు థియేటర్లో అంతా ఊగిపోతారు. కియారా కూడా సూపర్బ్ డాన్సర్. చరణ్ బాడీ మీద టాటూ షాట్ చూసినపుడు మీరంతా ఎలా అరిచి రెస్పాండ్ అయ్యారో... రీరికార్డింగ్ థియేటర్లో మేము కూడా అలాగే రెస్పాండ్ అయ్యాం. ఆ మ్యాటర్ నాకు బోయపాటిగారు కథ చెప్పినపుడు కూడా చెప్పలేదు. సీన్ తెలుసు కానీ... అలా ఉంటుందని తెలియదు. బోయపాటిగారు తీసిన విధానం అదిరిపోయింది. దాని కోసం థియేటర్లో వెయిట్ చేస్తారనిపించింది. అక్కడ వచ్చిన మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆ షార్ట్ వల్ల ఇన్‌స్పైర్ అయి చేసిందే. ఇలాంటి సినిమా చేసినందుకు బోయాపాటి గారికి థాంక్స్. ఆయన ఎలాంటి సినిమా అయినా లాజిక్ వదిలి పెట్టరు అని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు.

  గాంధీతో కేటీఆర్ పోలిక

  గాంధీతో కేటీఆర్ పోలిక

  మహాత్మ గాంధీజీ, కేటీఆర్‌ జీవితాలను పోల్చుతూ ఆ వీడియోను ప్రదర్శించారు. జాతీయోద్యమం సందర్భంగా దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి గాంధీజీ తిరిగి వచ్చాడు. అలాగే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతుంటే అమెరికాలో ఉద్యోగాన్ని వదిలేసి తెలంగాణకు కేటీఆర్ తిరిగి వచ్చారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తాను నిర్వహించిన ప్రతీ శాఖను అద్భుతంగా తీర్చిదిద్దారు. రాష్ట్ర ఐటీ రంగాన్ని పరుగులు పెట్టించారు. మున్సిపాలిటీ శాఖ చేపట్టి నగరాలను అద్భుతంగా అభివృద్ది చేశారు. అలా ప్రతీ రంగంలోనూ తన సత్తాను కేటీఆర్ చాటారు.

  రామ్ చరణ్ బిహేవియర్ ఎలా ఉంటుందో అనుకున్నా: స్నేహ

  రామ్ చరణ్ బిహేవియర్ ఎలా ఉంటుందో అనుకున్నా: స్నేహ

  స్నేహ మాట్లాడుతూ... 4 సంవత్సరాల తర్వాత నేను ఈ మూవీ చేస్తున్నాను. ఇది కంబ్యాక్ సినిమాగా చెప్పుకొచ్చు. కంబ్యాక్ ఫిల్మ్ ఇంత పెద్దదిగా ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదు. ఎన్నో సినిమాలు చేశాను కానీ చిరంజీవిగారితో చేయలేదు. ఆయనతో నటించాలనేది నా డ్రీమ్. అయితే నాకు రామ్ చరణ్‌తో కలిసి చేసే అవకాశం వచ్చింది. ఇది నాకు దక్కిన గొప్ప అవకాశం. రామ్ చరణ్ లాంటి వండర్‌ఫుల్ హ్యూమన్ బీయింగ్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. అతడు స్పాంటేనియస్ యాక్టర్ కూడా. అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మొదటి రోజు షూటింగుకు వెళ్లినపుడు అతడి బిహేవియర్ ఎలా ఉంటుందో..? అనుకున్నాను. కానీ డౌన్ టు ఎర్త్ పర్సన్ అని అర్థమైందని స్నేహ చెప్పుకొచ్చారు.

  త్రివిక్రమ్ శ్రీనివాస్

  త్రివిక్రమ్ శ్రీనివాస్

  వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ లైవ్ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. త్రివిక్రమ్‌తోపాటు రాంచరణ్, దర్శకుడు బోయపాటి శ్రీను వెంట వచ్చారు. ఆ తర్వాత భరత్ అనే నేను ఫేం కియారా అద్వాని కూడా వచ్చారు. వీరి రాకతో వేదిక వద్ద అభిమానుల అలజడి చెలరేగింది. భారీగా ఫ్యాన్స్ రావడంతో ప్రాంగణమంతా హడావిడిగా కనిపించింది.

  మరో గ్యాంగ్ లీడర్ కావాలని

  మరో గ్యాంగ్ లీడర్ కావాలని

  భోగవల్లి ప్రసాద్ మాట్లాడుతూ.. బోయపాటి సినిమాలంటే యాక్షన్ సినిమాలు గుర్తోస్తాయి. కానీ ఆయన టేకింగ్‌కు భిన్నంగా ఈ సినిమాకు వినయ విధేయ రామ అని పెట్టారు. దాంతో ఈ సినిమా అన్ని వర్గాలకు సంబంధించినదని అర్ధమైంది. ఈ సినిమా రాంచరణ్ కెరీర్‌లో మరో గ్యాంగ్ లీడర్ కావాలి అని అన్నారు.

  మాడ్రన్ లుక్‌లో ఇరుగదీసాడని

  మాడ్రన్ లుక్‌లో ఇరుగదీసాడని

  మైత్రీ మూవీస్ అధినేతల్లో ఒకరైన రవి ప్రకాశ్ మాట్లాడుతూ.. రంగస్థలం షూటింగ్ సమయంలో రెండు సార్లు మాత్రమే నార్మల్ గెటప్‌లో చూసేవాళ్లం. ఉదయం మేకప్‌కు ముందు.. ఆ తర్వాత మేకప్ తర్వాత. మళ్లీ ఎప్పుడు మాడ్రన్ లుక్‌లో చూస్తామో అని అనుకొన్నాం. కానీ వినయ విధేయ రామ చిత్రంతో తీరింది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం భారీ విజయం సాధిస్తుంది అన్నారు.

  రాంచరణ్‌కు అత్తగా నటించాను

  రాంచరణ్‌కు అత్తగా నటించాను

  నటి హేమ మాట్లాడుతూ.. నేను రాంచరణ్‌కు అత్తగా నటిస్తున్నాను. పవర్ స్టార్‌కు అత్తగా నటించలేదు. అయితే మెగా పవర్ స్టార్‌కు అత్తగా నటించే అవకాశం లభించడం ద్వారా ఆ కోరిక తీరింది. అందుకు దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత డీవీవీ దానయ్యకి థ్యాంక్స్ చెప్పాలి అని అన్నారు.

  బోయపాటి టేకింగ్‌ గురించి

  బోయపాటి టేకింగ్‌ గురించి

  నటి ప్రవీణ మాట్లాడుతూ.. బోయపాటి టేకింగ్ కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో ఇంకా బాగుంది. రాంచరణ్‌కు వదినగా నటించాను. నిర్మాత దానయ్య సెట్లో బాగా చూసుకొన్నారు. ప్రీ రిలీజ్‌కు వచ్చేసామంటే నిజంగా ఫ్యామిలీని మిస్ అవుతున్నాను అని అన్నారు.

  English summary
  Vinaya Vidheya Rama is an upcoming Indian Telugu-language action film written and directed by Boyapati Srinu. The film features Ram Charan and Kiara Advani, who made her debut in Tollywood with Bharat Ane Nenu, in the lead roles. Vivek Oberoi stars as the antagonist in this film which also has Prashanth, Aryan Rajesh, Sneha and Ananya in pivotal roles. Devi Sri Prasad has composed the music for the film, while senior producer DVV Danayya is bankrolling this film under the DVV Entertainments banner.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X