twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రీమియర్ షో టాక్: వినయ విధేయ రామ.. కేక పెట్టించే సీన్స్ ఉన్నాయి, మిస్ అయింది ఏంటంటే!

    |

    మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ వినయ విధేయ రామ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాంచరణ్ నటించడం ఇదే తొలిసారి. రాంచరణ్ ఈ చిత్రంలో చేసిన కండల ప్రదర్శన, అజార్బైజాన్ లో చిత్రికరించిన హార్స్ రైడింగ్, యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానుల్లో ఉత్కంఠని కలిగిస్తున్నాయి. దీనితో చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కైరా అద్వానీ గ్లామర్, దేవిశ్రీ సంగీతం, భారీ కాస్టింగ్ మరో ఆకర్షణ. సంకాంత్రి కానుకగా విడుదలవుతున్న వినయ విధేయ రామ చిత్ర ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో, ఏ అంశాలు చిత్రంలో ఆకట్టుకున్నాయో చూద్దాం!

     మాస్ ఆడియన్స్‌ని ఆకర్షించేలా

    మాస్ ఆడియన్స్‌ని ఆకర్షించేలా

    టాలీవుడ్ చిత్రాలకు ఎక్కువ ఆదరణ లభించేది మాస్ ప్రేక్షకుల నుంచే. వారిని సంతృప్తి పరిచే విధంగా సినిమా ఉంటే అద్భుతమైన వసూళ్లు వస్తాయి. ఆ తరహా చిత్రాలని తెరకెక్కించడంలో బోయపాటి దిట్ట. బోయపాటి సినిమాలో పెద్దగా కథకు ప్రాధాన్యం ఉండదు. ఆయన ఎక్కువగా యాక్షన్, ఎమోషన్ అంశాలపైనే ద్రుష్టి పెడతారు. వినయ విధేయ రామ చిత్రాన్ని కూడా అదే తరహాలో తెరకెక్కించారు.

    రామ్ కొణిదెల అంటూ

    రామ్ కొణిదెల అంటూ

    వినయ విధేయ రామ చిత్ర ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ముఖేష్ రిషికి.. రామ్ కొణిదెల అంటూ ఇచ్చే వార్నింగ్ సన్నివేశాన్ని అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బీహార్ లో వచ్చే ఎపిసోడ్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచే విధంగా ఉంది. రాంచరణ్ తన మాస్ యాటిట్యూడ్ తో ఆడియన్స్ ని మెప్పించాడు.

    సెకండ్ హాఫ్ ఎలా ఉందంటే

    సెకండ్ హాఫ్ ఎలా ఉందంటే

    ఫస్ట్ హాఫ్ మొత్తం బోయపాటి శైలిలో ఉంటూ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. కానీ సెకండ్ హాఫ్ లో దర్శకుడు రొటీన్ కథని నడిపించాడు. దీనితో ప్రేక్షకులు నిరాశకు గురవుతున్నారు. అజార్బైజాన్ లో తెరకెక్కించిన హార్స్ రైడింగ్, యాక్షన్ ఎపిసోడ్స్ కు టైమింగ్ కుదర్లేదనే టాక్ వినిపిస్తోంది. వినయ విధేయ రామ చిత్రంలోని యాక్షన్ సీన్స్ మాస్ కు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

    సంగీతం కూడా

    సంగీతం కూడా

    ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ సంగీత దర్శకుడు. దేవిశ్రీ కూడా కేవలం మాస్ ప్రేక్షకులని మాత్రమే దృష్టిలో పెట్టుకుని సంగీతం అందించాడు. బ్యాగ్రౌండ్ సంగీతం సన్నివేశాలకు బలం చేకూర్చే విధంగా లేదు. పాటల చిత్రీకరణ కూడా కొన్నింటిలో మాత్రమే బావుంది. రాంచరణ్, కైరా అద్వానీ తమ డాన్సులతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఓవరాల్ గా వినయ విధేయ రామ చిత్రం అంచనాలకు తగ్గట్లుగా లేదనే టాక్ వినిపిస్తోంది.

    English summary
    Vinaya Vidheya Rama Premier Shows Response and Highlights
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X