For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ తో సినిమా కత్తిమీద సాము: వివి వినాయిక్

  By Srikanya
  |

  రాజోలు : పవన్‌కల్యాణ్‌తో కూడా సినిమా చేస్తాను. ఇవి వూహించుకుంటే బాగానే ఉంది. వాటి చిత్రీకరణలను చేతపట్టడం సామాన్య విషయమేమీ కాదు. వాళ్ల సినిమాలంటే జనాలకు ఏం కావాలో నాకు తెలుసు. కానీ ముందు వాళ్లకి స్క్రిప్ట్‌ దొరకడం కష్టం. అంతేకాదండోయ్‌.. వాళ్ల సినిమాలకు కథా వస్తువు కత్తిమీద సాములాంటిది. అందుకే కథలో ప్రతి అంశాన్ని సునిశితంగా పరిశీలించి.. ఓ అంచనాకు రావాలి. అలాంటి కథల కోసం అన్వేషణ చేస్తున్నాను. అలాగే చిరంజీవితో 150వ సినిమా నాదే. తన తాజా చిత్రం నాయక్ సక్సెస్ టూర్ లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా వివరించారు.

  నేను ఇప్పటి వరకూ తీసిన అన్ని సినిమాలు.. తీయబోయే సినిమాలన్నింటిలోనూ ఓ సూత్రం నిమిఢీకృతమయ్యేలా ప్రణాళిక చేసుకుంటాను. సినిమాలో అసలు హీరోహీరోయిన్లు మామూలే! మరో కోణంలో హీరో సత్తాకు తగ్గట్టు.. సామాజిక అంశం హీరో అయితే.. హాస్యం హీరోయినే! తద్వారా కథను నడిపిస్తాను అంటూ వివి వినాయిక్ వివరించారు.

  నా సినిమాల్లో పోరాట సన్నివేశాల ఎఫెక్ట్‌లు ఎక్కువ ఉంటాయనేది నిజమే. కానీ ప్రస్తుత సినీ సమాజంలో హీరోలకు అవి సాధారణం అయ్యాయి. అవి లేకపోతే హీరోయిజాన్ని అనుకున్నరీతిలో చూపలేం. వాటికి కాస్త విజువల్‌ ఎఫెక్ట్స్‌ను కూడా జోడించాలి. సహజంగా తీయలేని సన్నివేశాలు కొన్ని ఆ ఎఫెక్ట్స్‌తో సాధ్యమవుతాయి. అసలు అలాంటి సన్నివేశాలకు సృజనే ఆయువు. సాంకేతికంగా కొన్ని తప్పులు చేస్తున్నా మనలోని సృజనాత్మకతతో వాటిని కప్పిపెట్టేయొచ్చు. మనకున్న పరిధుల్లో సాంకేతికంగా మాయ చేస్తూ విషయాన్ని చక్కగా చెప్పితే ప్రేక్షకులు కూడా అంగీకరిస్తారు. అప్పుడే ప్రేక్షకులు మన తప్పుల్ని మన్నిస్తారు.

  అలాగే నా సినిమాల్లో విజయ రహస్యం అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. థియేటర్‌కు ప్రేక్షకుల్ని రప్పించే పూర్తి బాధ్యత దర్శకుడిదే అని నమ్ముతాను. ఎందుకంటే అది నటీనటుల పాత్రలు, నిపుణుల సృజనాత్మకతే కాకుండా.. కోట్లాది రూపాయలు వెచ్చించే నిర్మాణ వ్యాపారాన్ని కూడా దృష్టిలో ఉంచుకుంటాను. పైగా సినిమా పేరు ప్రకటించినప్పటి నుంచీ అంచనాలు ఏర్పడుతుంటాయి. వీటన్నింటినీ తట్టుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు.

  ప్రతిఒక్కరూ నిజ జీవితంలో నాయక్‌లా ఉండాలి. అంత కాకపోయినా.. సాటివారికోసం కాస్త ఆలోచించాలి. ఈ సినిమాలో నేను టచ్‌ చేసిన సామాజిక అంశానికి మంచి గుర్తింపు వస్తుంది. ఇక నాయక్‌లో రామ్‌చరణ్‌ నటన చూస్తుంటే చిరంజీవి గుర్తుకొస్తున్నారని.. స్వయానా చిరంజీవితో పాటు నాకు చాలామంది ప్రముఖులు ఫోన్‌ చేస్తుంటే తీయని అనుభూతికి లోనవుతున్నా. సినిమాలోనే కాకుండా చిత్రీకరణలో కూడా బహ్మానందం పండించిన హాస్యం ఉల్లాసాన్నిచ్చింది. ఇక సినిమాను తెరపై అంత అద్భుతంగా చూపించిన కెమెరామెన్‌ ఛోటా.కె.నాయుడు పనితనం సినిమాకు ఫ్లస్‌ పాయింట్‌.

  గోదావరి అందాల కోసం వేరేగా వర్ణించేటంత కవిత్వం నాకు రాదు. అద్భుతంగా ఉంటాయి. నాకు చిన్నతనం నుంచి తూర్పుగోదావరితో ఎంతో అనుబంధం ఉంది. మా బంధువులు చాలామంది ఇక్కడే ఉన్నారు. అంతేకాదు మా నాన్నతో కలిసి ఇక్కడ కొలువై ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకునేవాళ్లం. ఇప్పటికీ నేను క్రమం తప్పకుండా అన్ని దేవాలయాలకు వస్తాను. ముఖ్యంగా వినాయకుడు, శ్రీలక్ష్మీనరసింహస్వామి అంటే మా కుటుంబానికి ఆరాధ్య దైవం. అయినవిల్లి, అంతర్వేది, కోరుకొండ, అన్నవరం క్షేత్రాలకు ప్రతి సినిమా చిత్రీకరణకు ముందు, విజయం సాధించాక కూడా వెళ్తాను అన్నారు.

  English summary
  
 VV Vinayak is currently enjoying the success of his latest release Nayak, starring Ram Charan. Vinayak, who went to Vizag on a thanksgiving gesture along with unit , said that he worked with megastar Chiranjeevi, Ram Charan, and Allu Arjun and now intends to direct powerstar if given an opportunity.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X