»   »  వి'నాయకా' దర్శకత్వం వహించు?

వి'నాయకా' దర్శకత్వం వహించు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొత్తానికి చిరంజీవి 149వ సినిమాకు వివివినాయక్ దర్శకత్వం వహిస్తాడనే విషయం ఫైనల్ అయ్యేట్టు కనిపిస్తోంది. గుణ శేఖర్ చెప్పిన కథను వద్దన్న చిరంజీవి ఎవరి దర్శకత్వంలో నటించాలా అనే సంశయంలో పడ్డారు. ఇపడది తీరిపోయినట్టుంది. రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలోనే నటించాలని చిరంజీవి అనుకుంటుండడం వలన సహజంగా వివివినాయక్ బెస్ట్ అప్షన్ అని ఆలోచించకుండానే చెప్పవచ్చు. ఎందుకంటే పూరి జగన్నాథ్ రాజకీయ నేపథ్యంలో సినిమాను తీసిన అనుభవం లేదు. శంకర్ కు చాలా కాలంగా గ్యాప్ వచ్చింది. ఠాగూర్ లాంటి సినిమాను తీసిన వివివినాయక్ సామాజిక నేపథ్యంలో సినిమాను తీయడం కొట్టిన పిండిగా చెప్పవచ్చు. చిరంజీవి 149వ చిత్రానికి అల్లు అరవింద్ తో పాటు అశ్వనీదత్ కూడా నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X