మసాలా ఎఫెక్ట్: ‘అల్లుడు శీను’ ఓపెనింగ్స్ అదిరాయ్...
హైదరాబాద్: టాప్ డైరెక్టర్ వివి వినాయక్ సినిమా అంటే హీరోతో సంబంధం లేకుండా క్రేజ్ ఉండటం సహజమే. ఇక సమంత హాట్ అండ్ సెక్సీ పెర్ఫార్మెన్స్ కూడా జనాలు థియేటర్ల వరకు రావడానికి బాగా తోడ్పడింది. మరో వైపు సెక్సీ బ్యూటీ తమన్నా ఐటం సాంగ్, బ్రహ్మానందం కామెడీ....ఇలా కమర్షియల్ సినిమాకు కావాల్సిన మసాలాలు వేసి సినిమాను ఘుమఘుమలాడించారు. వెరసి 'అల్లుడు శ్రీను' చిత్రం తొలిరోజు ఓపెనింగ్స్ కలెక్షన్స్ అదిరాయ్. దాదాపు స్టార్ హీరోల సినిమాలకు వచ్చేంత కలెక్షన్ రాబట్టినట్లు తెలుస్తోంది.

మొత్తానికి బెల్లకొండ సురేష్ తనయుడు సాయిశ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ చిత్రం లక్ష్యం దాదాపుగా నెరవేరింది. ఒక విజయవంతమైన కమర్షియల్ సినిమాతో సాయి శ్రీనివాస్‌ను లాంచ్ చేయాలనుకున్న దర్శక నిర్మాతలు టార్గెట్ దాదాపుగా రీచ్ అయ్యారు. తొలి సినిమాలో సాయి శ్రీనివాస్ పెర్ఫార్మెన్స్ పరంగా ఓకే అనిపించుకున్నాడు. డాన్సులు, పైట్లు బాగానే చేసాడు. కాస్త సానబెడితో మాస్ హీరో అవుతాడనే అభిప్రాయం అందరిలోనూ కల్పించాడు.
కాక పోతే సినిమా కథ, కథనం రొటీన్‌గా ఉండటంతో 'అల్లుడు శ్రీను' తొలిరోజు యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఏది ఏమైతేనేం....ఈ ఫలితాలతో నిర్మాత బెల్లంకొండ సురేష్ సంతృప్తిగానే ఉన్నాడు. అయితే సినిమాకు అతిగా పెట్టిన ఖర్చు ఎంత వరకు తిరిగి వస్తుంది? లాభాలు వస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది. వారం గడిస్తేగానీ సినిమా లాభనష్టాలను పూర్తి స్థాయిలో బేరీజు వేయడానికి వీలవుతుంది.


Click it and Unblock the Notifications











