twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వివి వి‘నాయక్’ పబ్లిసిటీ ఏడుపు...!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన 'నాయక్' చిత్రం ఈ నెల 9న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత తన ఖాతాలో హిట్ సినిమా పడటంతో దర్శకుడు వివి వినాయక్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. ఇదే అదునుగా వీలైనంత మేరకు సినిమాకు ఎక్కువ పబ్లిసిటీ కల్పించి 'నాయక్'ను నెం.1 హిట్ సినిమా నిలబెట్టి నెం.1 దర్శకుడిగా పేరు తెచ్చుకునేందుకు ట్రై చేస్తున్నాడు వినాయక్.

    ఇందులో భాగంగా దర్శకుడు.... మీడియా ముందు పబ్లిసిటీ ఏడుపులు ఏడుస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలో సిద్ధార్థ నాయక్ (రామ్ చరణ్) బావ(రాజీవ్ కనకాల) చనిపోయినప్పుడు చోటు చేసుకున్న సన్నివేశంలో చరణ్ నటన తనను కంట తడి పెట్టించింది. ఏడుపు ఆపుకోలేక పోయాను. నా కంటి నుంచి కొన్ని చుక్కలు నీళ్లు కారాయి. రామ్ చరణ్ ఒక అద్భుతమైన నటుడిగా ఎదుగుతున్నాడు, అందుకు 'నాయక్' సినిమానే నిదర్శనం అంటూ చెబుతున్నాడట.

    కాగా తొలి రోజు గ్రాండ్ గా 1200లకు పైగా థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన నాయక్ చిత్రం.... భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి రోజు కేవలం ఏపిలోనే దాదాపు రూ. 10 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ టాక్. ఇక ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియా కలుపుకుంటే ఈ మొత్తం మరింత పెరిగి పాత రికార్డులు బద్దలు కొట్టే అవకాశం కూడా లేక పోలేదు.

    వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన నాయక్ చిత్రాన్ని యూనివర్సల్‌ మీడియా సంస్థ నిర్మించింది. డి.వి.వి.దానయ్య నిర్మాత. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ హీరోయిన్స్ గా చేసారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌ రెడ్డి, రాహుల్‌ దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌ రావత్‌, సుధ తదితరులు నటించారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్‌ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్.

    English summary
    Vinayak tears for Publicity : 'One scene where Ram Charan's performance has ran me into tears was during the death scene of his Bava (Rajiv Kanakala). I could not control myself and tears dropped down from my eyes. He is establishing as a superb actor and 'Nayak' will stand as a right example. The variations shown in dual roles were not that easy but Charan has done it like a professional,' Vinayak praised his hero.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X