»   » మరో 'ఠాగూర్' కోసం చూస్తున్నా: వినాయక్

మరో 'ఠాగూర్' కోసం చూస్తున్నా: వినాయక్

Subscribe to Filmibeat Telugu

సమాజాన్ని మేల్కొలిపే 'ఠాగూర్‌' వంటి మరో చిత్రాన్ని తీయాలని ఉందని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ అన్నారు. అయితే అందులో హీరో ఎవరన్నది ఆయన చెప్పలేదు. కోరుకొండ మండలం గాదరాడలోని తన చెల్లి శ్రీదేవి, బావ కుంచే శ్రీనివాస్‌ ఇంటికి బుధవారం వినాయక్‌ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఠాగూర్‌ వంటి సినిమా తీయడానికి మంచి కథకోసం చూస్తున్నట్టు తెలిపారు. చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్‌తో సినిమా చేస్తానన్నారు. తాను మొదటగా తీసిన 'ఆది' సినిమా ఎంతో పేరు తెచ్చిందన్నారు.

అలాగే తన దర్శకత్వంలో వచ్చిన 'ఆది, దిల్‌, ఠాగూర్‌, లక్ష్మి, బన్ని 'తదితర సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. ఇప్పటికి 10 చిత్రాలు తీశానని, 11వ చిత్రంగా 'బద్రినాథ్‌' తీస్తున్నానని తెలిపారు. గీతా ఆర్ట్స్‌ ఫిలింస్‌ పతాకంపైఅల్లు అర్జున్‌, తమన్నా హీరోహీరోయిన్లుగా అల్లు అరవింద్‌ నిర్మిస్తు న్న చిత్రానికి తాను దర్శకత్వం వహిస్తున్నానన్నారు. చిన్నికృష్ణ కథ, కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ మేలో ప్రారంభమై, దశమికి విడుదల అవుతుందని చెప్పారు. కుంచే శ్రీను, ఎంపీటీసీ అరిబోలు చినబాబు, రాంబాబు వినాయక్‌ తో ఉన్నారు.

వి.వి.వినాయక్‌కు స్వాగతం: మధురపూడి విమానాశ్రయంలో దిగిన వివి వినాయక్ ‌కు పలువురు అభిమానులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. మధురపూడి విమానాశ్రయం నుంచి ఆయన గాదరాడలోని తన బావ కుంచే శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లారు. వినాయక్‌ తో ఫొటోలు దిగేందుకు పలువురు పోటీ పడ్డారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu