»   »  సూపర్ స్టార్ చనిపోలేదు.. వార్త అవాస్తవం.. అవసరమైతే అవయవ దానం చేస్తా.. బాలీవుడ్ హీరో..

సూపర్ స్టార్ చనిపోలేదు.. వార్త అవాస్తవం.. అవసరమైతే అవయవ దానం చేస్తా.. బాలీవుడ్ హీరో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అలనాటి బాలీవుడ్ సూపర్‌స్టార్ వినోద్ ఖన్నా తీవ్ర అనారోగ్యానికి గురై మరణించారనే వార్త మీడియాలో సంచలనం రేపింది. వినోద్ ఖన్నా ఇక లేరంటూ సోషల్ మీడియాలో రూమర్ విస్తృతంగా ప్రచారమైంది. ఈ వార్తలపై కలత చెందిన కుటుంబ సభ్యులు ఆ వార్తల్లో వాస్తవం లేదని, అన్ని తప్పుడు వార్తలేనని మీడియాకు వివరణ ఇచ్చారు.

 ప్రైవసీకి భంగం కలిగించొద్దు..

ప్రైవసీకి భంగం కలిగించొద్దు..

వినోద్ ఖన్నా తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన తర్వాత కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని మీడియాను వేడుకొన్నారు. ప్రస్తుతం వినోద్ ఖన్నా గురుగ్రామ్‌లోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

 ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది

ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది

వినోద్ ఖన్నా ఆరోగ్యం చికిత్సకు సహకరిస్తున్నది. ఆయన ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉంది. ఆయన త్వరగా కోలుకోవడంపై కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారు అని హాస్పిటల్ వర్గాలు ఓ ప్రకటనను విడుదల చేశాయి. వినోద్ ఖన్నా బ్లాడర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు వార్తలు రాగా, ఆయన డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారని కుమారుడు రాహుల్ ఖన్నా మీడియాకు తెలిపారు.

ఆందోళన చెందిన ఇర్ఫాన్ ఖాన్

ఆందోళన చెందిన ఇర్ఫాన్ ఖాన్


సోషల్ మీడియాలో వచ్చిన సూపర్‌స్టార్ వినోద్ ఖన్నా ఫొటో చూసి ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఆందోళన చెందాడు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. త్వరలోనే ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారన్న నమ్మకం ఉంది. ఒకవేళ అవసరమైతే నేను ఆయనకు అవయవదానం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. బాలీవుడ్ పరిశ్రమలో అందరి కంటే వినోద్ ఖన్నా అద్భుతమైన వ్యక్తి అని ఇర్ఫాన్ పేర్కొన్నారు.

 త్వరగా కోలుకోవాలని

త్వరగా కోలుకోవాలని

వినోద్ ఖన్నా ఫొటో చూసి షాక్ గురయ్యాను. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని పలువురు బాలీవుడ్ ప్రముఖులు పేర్కొన్నారు. వినోద్ ఖన్నా చివరిసారిగా షారుక్ ఖాన్, కాజోల్ నటించిన దిల్‌వాలే చిత్రంలో కనిపించారు. దంబాగ్ చిత్రంలో వినోద్ ఖన్నా సల్మాన్ ఖాన్‌కు తండ్రిగా నటించారు. ఆయన బీజేపీ ఎంపీగా కూడా గతంలో సేవలందించారు.

English summary
In social media, rumours spread that the veteran actor Vinod Khanna has passed away. A source very close to Vinod Khanna told that the rumours of his demise are false. In this situation, Actor Irrfan Khan who spoke to the media and told that If needed, I'll donate one of my organs to him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu