»   »  కాజోల్-ధనుష్ ఫైట్: ‘విఐపి-2’ ట్రైలర్ అదిరిపోయింది

కాజోల్-ధనుష్ ఫైట్: ‘విఐపి-2’ ట్రైలర్ అదిరిపోయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ స్టార్ ధనుష్ నటించిన 'విఐపి-2' తెలుగు ట్రైలర్ రిలీజైంది. గతంలో ధనుష్ నటించిన 'రఘువరన్‌ బి.టెక్‌' భారీ విజయం సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రమే 'విఐపి 2'.

ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ కాజోల్ ప్రతినాయకి పాత్రలో కనిపించబోతోంది. 'నా పేరు రఘువరన్‌. నేనిప్పుడు మళ్లీ వెరీ ఇంపార్టెంట్‌ పనిలేనోడిని' అంటూ మొదలైన ఈ ట్రైలర్లో ధనుష్, కాజోల్ మధ్య వచ్చే సీన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రంలో కాజోల్ వసుంధర కన్‌స్ట్రక్షన్స్‌ అధినేతగా కనిపించబోతెన్నారు. ఓ సీన్లో ధనుష్ ను ఉద్దేశించి..... నువ్వు నీ సొంత కంపెనీకి ఎండీగా ఉండటం కన్నా... నా కంపెనీలో ఎంప్లాయ్ గా ఉండటమే మంచి గుర్తింపు ఇస్తుంది అంటే..... 'మేడం నేను పులికి తోకలా ఉండటం కన్నా, పిల్లికి తలలా ఉండటమే ఇష్టం' అంటూ ధనుష్‌ చెప్పిన పంచ్‌డైలాగ్‌ ట్రైలర్ కే హైలెల్.

కాజోల్, ధనుష్ ఫైట్

ధనుష్‌ను ఢీకొట్టే వ్యాపారవేత్త పాత్రలో కాజోల్ నటిస్తున్నారు. అంతమాత్రన పూర్తిగా విలన్ గా భావించకూడదు. కాజోల్ తన నటనతో అభిమానులకు కొత్త అనుభూతిని కలిగిస్తారు అని దర్శకురాలు సౌందర్య తెలిపారు. ఆమె పాత్రలో విభిన్నమైన కోణాలున్నాయని పేర్కొన్నారు.

అమలా పాల్, ధనుష్ కామెడీ

అమలా పాల్, ధనుష్ కామెడీ

ఈ చిత్రంలో ధనుష్, అమలా పాల్ భార్య భర్తలుగా కనిపించబోతున్నారు. ఇద్దరి మధ్య వచ్చే సీన్లు ప్రేక్షకులను నవ్వించబోతున్నాయని ట్రైలర్ చూస్తే స్పష్టం అవుతోంది.

ఎంటర్టెన్మెంట్ గ్యారంటీ

ఎంటర్టెన్మెంట్ గ్యారంటీ

కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ ఇలా అన్ని కలగలిపి ఫుల్లీ లోడెడ్ ఎంటర్టెన్మెంట్ చిత్రంగా ‘విఐపి 2' రూపొందించారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ధనుష్ కథ, డైలాగ్స్

ధనుష్ కథ, డైలాగ్స్

వండర్‌బార్స్‌ స్టూడియోస్‌, వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్. థాను, ధనుష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ధనుష్ కథ, మాటలు అందించడ విశేషం. రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.

English summary
Raghuvaran Is Back! Unleashing the Official Telugu Trailer of "VIP 2" starring Dhanush, Kajol, Amala Paul & others in lead; Directed by Soundarya Rajinikanth.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu