»   » ఇలా కూడా వాడేస్తారా :'బాహుబలి' ట్రైలర్ లో మోడీ...వైరల్ వీడీయో,స్వయంగా సీఎం

ఇలా కూడా వాడేస్తారా :'బాహుబలి' ట్రైలర్ లో మోడీ...వైరల్ వీడీయో,స్వయంగా సీఎం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి సినిమాకు దేశ వ్యాప్తంగా ఉన్న ఆ క్రేజే తెలిసిందే. ఈ సినిమా పై ఎన్నో ప్యారెడీలు వచ్చాయి. కానీ మీరు ఈ క్రింద చూసేటువంటి వీడియో మాత్రం ఇప్పటికి వరకూ రాలేదని ఖచ్చితంగా చెప్పచ్చు. ఏకంగా ఎలక్షన్స్ లో ప్రచారం కోసం బాహుబలిని వాడేసారు.

Viral video: When Uttarakhand CM Harish Rawat as ‘Bahubali’ left PM Narendra Modi, Amit Shah ‘awed’

బాహుబలి చిత్రం అందరి నోళ్లల్లో నానుతూనే ఉందనే విషయం.. క్యాచ్‌ చేసిన కాంగ్రెస్.. ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు బాహుబలి టూ పేరుతో ప్రచార వీడియోను రూపొందించింది. ఎవ్వరంట.. ఎవ్వరంటా సాంగ్‌ బ్యాగ్రౌండ్‌ తో తయారు చేసిన ఆ వీడియోను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్‌ సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు.


ఈ పాటలో బాహుబలిగా హరీష్ రావత్ ఉత్తరాఖండ్ మ్యాపును తన భుజాలపై ఎత్తుకుంటారు. ఈ వీడియోలో బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా తో పాటు.. తనికెళ్ల భరణి స్థానంలో ప్రధాని మోడీని చూపించడం మరింత అట్రాక్ట్‌ చేస్తోంది.

ఉత్తరాఖండ్ పోరాట యోధుడు హరీష్ రావత్ అని టైటిల్ పడగా.. పాట ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని ప్రసిద్ధమైన ప్రాంతాల ఫోటోలు కనిపిస్తాయి. మరో విషయం ఏమంటే.. రావత్ ఉత్తరాఖండ్‌ను భుజంపై పెట్టుకొని నడుస్తుండగా బీజేపీ అధ్యక్షులు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ అవాక్కయినట్లుగా కనిపిస్తారు.

Viral video: When Uttarakhand CM Harish Rawat as ‘Bahubali’ left PM Narendra Modi, Amit Shah ‘awed’

తనికెళ్ల భరణి స్థానంలో మోడీ కనిపిస్తారు. అసలు వీడియోను ఎడిట్ చేసి ఒక ముఖాలు మాత్రమే పెట్టారు. ఇంతకీ బాహుబలి టీమ్ నుంచి ఫర్మిషన్ తీసుకునే చేసారా లేక స్ఫూఫ్ లాగ లేగేసారా...

English summary
In a recent attempt to trend online, a video which went viral on social media showed Uttarakhand CM Harish Rawat as the iconic character ‘Bahubali’
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu