twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Virata Parvam Pre Release Event: అతను చంద్రుడు, ఆమె వెన్నెల.. విరాటపర్వం ఒక జ్ఞాపకం: వేణు ఉడుగుల

    |

    రానా దగ్గుబాటి - సాయి పల్లవి జంటగా నటించిన విరాటపర్వం సినిమా ఈ నెల 17వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను బుధవారం గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ వేడుకలో దర్శకుడు వేణు ఉడుగుల విరాటపర్వం సినిమా గురించి అద్భుతమైన మాటలతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

    డైరెక్టర్ స్పీచ్

    డైరెక్టర్ స్పీచ్

    వేణు ఉడుగుల మాట్లాడుతూ.. ఈ వేడుకకు వచ్చిన అతిథులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా అభిమానులందరికీ కూడా స్పెషల్ థాంక్స్. మొదట నా టీమ్ సభ్యులందరికీ కూడా నేను స్పెషల్ థాంక్స్ చెప్పుకోవాలి. ముఖ్యంగా రైటర్స్ గా వర్క్ చేసిన అందరు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డారు. అలాగే నా అసిస్టెంట్ డైరెక్టర్స్ చివరి వరకు నాతోపాటు ట్రావెల్స్ చేస్తూ వచ్చారు.. అని అన్నారు.

     వీళ్లందరి స్ఫూర్తి తోనే

    వీళ్లందరి స్ఫూర్తి తోనే

    ఇక ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే సింహాలు వాటి చరిత్ర వ్రాసుకుననెంత వరకు వేటగాడు చెప్పింది చరిత్ర అవుతుంది. అలాగే మన కథ మనము రాసుకోనంత వరకు.. మన జీవితానికి మనమే ఆవిష్కరించినంత కాలం వరకు పక్కవాడు చెప్పిందే మన జీవితం అవుతుంది. ఈ స్పృహలోనే తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుకుంటే రాఘవేంద్ర రావు గారి ఫాదర్ ప్రకాష్ రాజు గారు కృష్ణ గారు కావచ్చు ఇటీవల సినిమాలు తీసిన సుకుమార్ గారు కావచ్చు వీళ్లందరి స్ఫూర్తి తోనే నా మూలాల్లోకి నేను వెళ్లి తీసిన సినిమా విరాటపర్వం.. అని వేణు అన్నారు.

    ప్రేమ ఒక్కటే దైవం

    ప్రేమ ఒక్కటే దైవం

    విరాటపర్వం సినిమాలో మేము ఎక్కడా కూడా వైలెన్స్ హైలెట్ చేయలేదు. అలాగే మావోయిస్టు సిద్ధాంతాన్ని ప్రాపగాండాగా చూపించలేదు. ప్రేమ ఒక్కటే దైవం అని చెప్పగలిగాము. ప్రేమకు మించిన ప్రజాస్వామ్య విలువ ఈ లోకంలో ఏదీ లేదు అని చెప్పాము. 1990వ దశకంలో ఒక ఒక రాజకీయ మహా సంక్షోభాన్ని అలాగే ఇతర అంశాలను ఆధారంగా చేసుకుని తెరపైకి తీసుకువచ్చిందే విరాటపర్వం స్టోరీ.

    ఆమె వెన్నెల.. అతను చంద్రుడు

    ఆమె వెన్నెల.. అతను చంద్రుడు

    ఒక పాటకు పల్లవి అనేది ఎంత ముఖ్యమో విరాటపర్వం సినిమా కూడా సాయిపల్లవి అంతే ముఖ్యం. అలాగే లిరిక్స్ లేకుండా ఒక పాట ఉండదు. అలాగే రానా గారు కూడా ఈ సినిమాకు అంతే ముఖ్యం. అతను చంద్రుడు అయితే ఆమె వెన్నెల.. సినిమాలో ముఖ్యమైన పాత్రలలో ఐదు మంది మహిళలు ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా పోటీగా వర్క్ చేశారు.

    విరాటపర్వం ఒక జ్ఞాపకం

    విరాటపర్వం ఒక జ్ఞాపకం

    ఇక వాళ్ళందరిని నాకు ఇచ్చిన నిర్మాతలు ఇద్దరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. వారి వల్లే ఈ రోజు ఈ సినిమాను ఇంత బాగా తీయగలిగాను. ఈ వేదికగా నేను ఒక ప్రధాన అంశాన్ని గుర్తు చేయదలచుకున్నాను. ఈ సినిమా మీకు ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుంది. అలాగే ఒక గొప్ప జ్ఞాపకంగా ఉంటుంది అని హామీ ఇస్తున్నాను. ఈనెల 17వ తేదీన ఈ సినిమా తప్పకుండా చూడాలని కోరుకుంటున్నట్లు.. వేణు ఉడుగుల దర్శకుడు వివరణ ఇచ్చాడు.

    English summary
    Virata Parvam Pre Release Event director venu udugula powerful speech..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X