Don't Miss!
- News
బెంగళూరులో సరికొత్త `సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా`: ముఖ్యమంత్రి ప్రకటన
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Virata Parvam Pre Release Event: రామ్ చరణ్ అభిమానులకు క్షమాపణలు.. ఇదే చివరి సినిమా: రానా
రానా దగ్గుబాటి - సాయి పల్లవి జంటగా నటించిన విరాటపర్వం సినిమా ఈ నెల 17వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను బుధవారం గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ వేడుకలో హీరో రానా దగ్గుబాటి విరాటపర్వం సినిమా గురించి తన అద్భుతమైన మాటలతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..
Recommended Video


రామ్ చరణ్ ఎందుకు రాలేదంటే..
రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ఇక్కడికి విచ్చేసిన విక్టరీ అభిమానులందరికీ కూడా నమస్కారాలు. మా చిన్నాన్న వెంకటేష్ గారు లేకుండా నా పర్సనల్ లైఫ్ లో అలాగే ప్రొఫెషనల్ లైఫ్ లో ఏ పని జరగదు. కాబట్టి ఇక్కడికి అయిన వచ్చినందుకు చాలా థాంక్స్. అలాగే ఇక్కడికి విచ్చేసిన సాయి పల్లవి గారి అభిమానులకు కూడా గ్రాండ్ గా వెల్ కమ్ చెబుతున్నాను.
ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులకు ఒకటి చెప్పాలి. రామ్ చరణ్ ఫ్లైట్ మిస్ అయ్యి ఇంకా హైదరాబాద్కు చేరుకోలేదు. కాబట్టి ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ పాల్గొనే అవకాశం లేదు. రామ్ చరణ్ తరపున నేను సారీ చెబుతున్నాను. కాబట్టి అర్థం చేసుకోవాలి అని కోరుకుంటున్నాను.. అని రానా దగ్గుబాటి తెలియజేశాడు.

అద్భుతమైన లవ్ స్టోరీ
ముందుగా ఈ డైరెక్టర్ వేణు గురించి మాట్లాడాలి అసలైన నిజాయితీతో తను పెరిగిన ఊర్లలో తను పెరిగిన పరిస్థితులలో ఒక భయంకరమైన బ్యాక్ గ్రౌండ్ లో అద్భుతమైన లవ్ స్టోరీ చేశాడు. అలంటి ఈ ప్రత్యేకమైన స్టోరీనే తీసుకువచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
అలాగే ఆ భయంకరమైన లవ్ స్టోరీ లో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది అని చెప్పాలి. అందుకు సాక్ష్యం సాయి పల్లవి.. అని రానా అన్నారు.

సాయి పల్లవి లేకపోతే..
ఆమె నడుస్తూ ఉంటే చాలు పక్కనే వెన్నెలా తిరుగుతున్నట్లు ఉంటుంది. ఎవరు ఉన్నా లేకపోయినా ఈ సినిమాలో సాయి పల్లవి గారు లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు. సాయి పల్లవి తో ఈ సినిమాలో నటించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నిర్మాతలు శ్రీకాంత్ గారు సుధాకర్ గారు ఇలాంటి అద్భుతమైన సినిమాను నిర్మించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు.
అలాగే ఈ సినిమాకు వర్క్ చేసిన డానీ, సురేష్ బొబ్బిలి అలాగే మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా వారి హార్ట్ కి దగ్గరగా పని చేశారు.. అని తెలియజేశారు.

ఇది వారి సినిమా
ఇక రవన్న దళంలో నటించిన ప్రియమణి గారు నవీన్ చంద్ర నాతో ముఖ్యమైన పాత్రల్లో నటించారు. అలాగే మిగతా నటీమణులు అందరు కూడా ఎంతో బాగా నటించారు. నిజంగా దర్శకుడు చెప్పినట్లు ఈ సినిమాలో ఆరు ముఖ్యమైన పాత్రలో ఐదు పాత్రలు మహిళలు చేశారు. కాబట్టి ఇది వారి సినిమా అని చెప్పవచ్చు.

ఆ రూట్లో ఇదే చివరి సినిమా
ఇక చివరగా నా ఫ్యాన్స్ గురించి ఒకటి చెప్పాలి. అలాగే ఒక నిజం చెప్పాలని అనుకుంటున్నాను. ఎప్పుడూ కూడా విక్టరీ వెంకటేష్ గారి ఫ్యాన్స్ మాత్రమే నా వెనకాల ఉంటారు నా ఫ్యాన్స్ ఎవరూ ఉండేవారు కాదు అని అనుకున్నాను. ఇక ఇప్పటివరకు నాకు నచ్చినట్లు కొత్త కథలు చెప్పాలని సినిమాలు చేసుకుంటూ వెళ్ళను. కానీ ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో నాకు అర్థమైంది. ఎందుకంటే వారందరూ కూడా ఇలాంటి సినిమా చేయవద్దని చెప్పారు. అయితే ఒక యాక్టర్ గా ఇదే నా లాస్ట్ ప్రయోగాత్మకమైన చిత్రం. ఇక్కడ నుంచి సినిమాలు మీకోసం చేస్తా ఉంటాను. పిచ్చెక్కిచ్చేద్దాం అంటూ రానా దగ్గుబాటి వివరణ ఇచ్చాడు.