For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Virata Parvam Trailer : ట్రైలర్ తోనే గూజ్ బంప్స్ తెప్పించేశారు.. ప్రేమ కోసం గన్ను పట్టిన సాయి పల్లవి!

  |

  రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం విరాటపర్వం. నీది నాది ఒకే కథ ఫేం వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయింది. అయితే కరోనా పలు దశల వలన రిలీజ్ వాయిదా పడింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా 2021 ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా వేసింది చిత్రబృందం. ఎలా అయితేనేమి ఏడాది తర్వాత జూన్ 17న సినిమా విడుదల అవుతుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు. ఆ వివరాలు

  నక్సలిజం నేపథ్యంలో

  నక్సలిజం నేపథ్యంలో

  రానా, సాయిపల్లవి జంటగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం విరాటపర్వం. నక్సలిజం ఉద్యమం నేపథ్యంలో వస్తోన్న సినిమా కావడంతో దీనిపై అందరిలో ఓ ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనేక వాయిదాల అనంతరం ఎట్టకేలకు విడుదల కాబోతుంది. ఈ నెల 17 రిలీజ్‌కి సిద్ధమైన ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ప్రకటించినప్పట్నుంచి చిత్ర బృందం ప్రమోషన్‌ జోరు పెంచింది. ఇటీవల నగా దారిలో అంటూ సాగే విప్లవ గీతాన్ని విడుదల చేయగా, దానికి మంచి స్పందన లభించింది. రానా, సాయిపల్లవిల మధ్య ప్రేమని, వారి ఆశయాలను ఆవిష్కరించేలా సాగిన పాట యూట్యూబ్‌లో ట్రెండ్‌ కూడా అయ్యింది. ఈ పాటను సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి కంపోజ్ చేయగా వరం పాడారు.

   కోడిని కోసి కల్లు పోస్తా

  కోడిని కోసి కల్లు పోస్తా

  ఇక ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డీ సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రానా, సాయి పల్లవితో పాటు ప్రియమణి, నందితా దాస్, జరీనా వహాబ్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రావు, నివేదా పేతురాజ్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిన్న ఎవడు ? పెద్ద ఎవడు? రాజ్యమేలే రాజు ఎవడు?సామ్యవాద పాలనే స్థాపించగా ఎదిగిన వాడు అంటూ రానా వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. తరువాత సాయి పల్లవి ఒక పుస్తకాన్ని దేవతకు చూపిస్తూ ఈ పుస్తకాన్ని రాసిన వాడు ఎవరో నువ్వు నా ముందుకు తీసుకు వస్తే నీకు కోడిని కోసి కల్లు పోస్తా అంటూ మొక్కుటుంది.

  గూజ్ బంప్స్ వచ్చేలా

  గూజ్ బంప్స్ వచ్చేలా

  తర్వాత ఒక ఊరి మీద పోలీసులు కాల్పులు జరుగుతున్న సమయంలో నక్సలైట్ రావన్నగా రానా దగ్గుబాటి ఎంట్రీ ఇస్తాడు. రవన్న దళం వచ్చింది రా అంటూ రానా దగ్గుబాటి ఎంట్రీ ఇస్తుంటే మొత్తం గూజ్ బంప్స్ వచ్చేలా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు సురేష్ బొబ్బిలి. తర్వాత రవి రాసిన పుస్తకాన్ని చూస్తూ నేను నీకు అభిమాని అయిపోయాను ఈ భావానికి ఏం పేరు పెట్టాలో కూడా అర్థం కావడం లేదు అంటూ సాయి పల్లవి ఒంటరిగా ఆలోచిస్తున్న వైనాన్ని చూపించారు.

   ఊపిరి సలపని యుద్ధం

  ఊపిరి సలపని యుద్ధం

  ఊరిలో ఉన్న ఎర్ర జెండా దిమ్మను పగల కొడుతున్న సమయంలో అది కూడా పట్టించుకోకుండా సాయి పల్లవి నక్సలిజం వైపు ప్రభావితం అయి అడవుల్లోకి వెళ్లడాన్ని చూపించారు. అయితే రానా ఇది కరెక్ట్ కాదని తాము ఊపిరికి ఊపిరికి మధ్య ఊపిరి సలపని యుద్ధం చేస్తున్నామని ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదని ఆమె ప్రయత్నం చేసినా వినకుండా ఆమె రానా కోసం నక్సల్ గా మారినట్టు ట్రైలర్ లో హింట్ ఇచ్చాడు దర్శకుడు. ఇక ట్రైలర్ చివరిలో సాయి పల్లవి గన్ పట్టుకుని షూట్ కూడా చేసినట్టు చూపించారు.

  ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా

  ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది నా పేరు వెన్నెల ఇదేనా కధ అంటూ సాయి పల్లవి చెబుతున్న డైలాగ్ తో ట్రైలర్ ముగించారు. మొత్తం మీద ముందు నుంచి ప్రచారం జరుగుతున్న విధంగా రవన్న అనే నక్సలైట్ మీద ప్రేమ పెంచుకున్న వెన్నెల అనే అమ్మాయి ఆయన కోసం అడవికి వెళ్లి ఎలా నక్సలైట్ గా మారింది అనే కథని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఈ టీమ్ సిద్ధమయ్యారు. ఇక ట్రైలర్ ఆద్యంతం కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమా మీద అంచనాలు పెంచే విధంగా కట్ చేశారు. ట్రైలర్ చూస్తున్నంత సేపు గూస్బంప్స్ తెప్పించే విధంగా దర్శకుడు ట్రైలర్ కట్ చేశారు.

  English summary
  Virata Parvam Trailer : looking raw and intense
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X