»   » సిద్ధంగా ఉండండి: జూన్ 30న సంపూ ‘వైరస్’ ఎటాక్

సిద్ధంగా ఉండండి: జూన్ 30న సంపూ ‘వైరస్’ ఎటాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సంపూర్ణేష్ బాబు టైటిల్ పాత్రలో ఎ.ఎస్.ఎన్ ఫిలిమ్స్ పతాకంపై ఎస్.ఆర్.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "వైరస్". "నో వేక్సిన్, ఓన్లీ టాక్సిన్" అనేది ట్యాగ్ లైన్. గీత్ షా కథానాయిక. సలీమ్.ఎం.డి-శ్రీనివాస్ వంగాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పుల్లరేవు రామచంద్రారెడ్డి సమర్పిస్తున్నారు. మీనాక్షి భుజంగ్-సునీల్ కశ్యప్ లు సంయుక్తంగా సంగీతం అందించిన ఈఈ చిత్రం పాటలతోపాటు ట్రైలర్ కూడా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొంది. హిలేరియస్ దర్భంగాఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ 30న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేసుకొంటున్నారు.

సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.. "సినిమా రంగానికి రాక ముందు ప్రేక్షకుల్లో ఒకడిగా ఉండే వాడిని. ఇపుడు స్క్రీన్ పై కనపడుతున్నాను అంటే కారణం. స్టార్ హీరోల ఫాన్స్ కారణం. నా మొదటి చిత్రం "హృదయ కాలేయం", తరువాత మోహన్ బాబు ఆశీస్సులతో చేసిన "సింగం 123" సినిమాలు నాకు మంచి పేరుని తెచ్చిపెట్టాయి. ఇపుడు ఈ వైరస్ అదే సక్సెస్ ని అందిస్తుందని ఆశిస్తున్నాను. నా సినిమా నుండి కోరుకునే అన్నీ అంశాలు ఈ వైరస్ లో ఉంటాయి. వెన్నెల కిశోర్ విలన్ గా చేసిన పాత్ర అందరిని ఆకట్టుకునెలా ఉంటుంది" అన్నారు.


 'Virus' starring Sampoornesh Babu release on 30 June

డైరెక్టర్ క్రిష్ణ మాట్లాడుతూ.. "ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం నిర్మాతలు. సంపూర్ణేష్ బాబు సహకారం మరువలేనిది. రెగ్యులర్ కామెడీ ఎంటర్ టైనర్ లా కాకుండా ఈ సినిమాలో మంచి ట్విస్ట్ ఉంటుంది" అన్నారు.


ఈ చిత్రానికి సంగీతం: మీనాక్షీ భుజంగ్-సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ: వి.జె, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, మాటలు: దుర్గాప్రసాద్ రాయుడు, నిర్మాతలు: సలీమ్.ఎం.డి-శ్రీనివాస్ వంగాల, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎస్.ఆర్.కృష్ణ!


English summary
'Virus' starring Sampoornesh Babu in the titular role is coming to audience on June 30.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu