»   » విశాల్‌ 'పల్నాడు' స్టోరీ లైన్

విశాల్‌ 'పల్నాడు' స్టోరీ లైన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  హైదరాబాద్ : అతను చూడ్డానికి ఆరడుగులుంటాడు. కానీ చాలా భయస్తుడు. ఎదుటివాడు ఏమన్నా సరే... సర్దుకుని వెళతాడు. మనం ఒకడ్ని కొడితే వాడు పదిమందిని తీసుకొస్తాడేమో అనేది ఆ కుర్రాడి భయం. ఆ పదిమందిని కొడితే ఇంకో వందమందిని తీసుకొస్తాడు కదా అని లాజిక్‌ మాట్లాడతాడు. అంతమందితో పోరాడటంకన్నా సర్దుకొని వెళ్లడమే మేలంటాడు. కానీ అతన్ని ప్రతిసారీ ఎవరో ఒకరు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. దీంతో చేసేదేమీ లేక తిరగబడ్డాడు. తనలో వున్న పౌరుషాన్ని బయటకు తీశాడు. మరి ఆ తర్వాతేమైందో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు విశాల్. విశాల్ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం 'పల్నాడు'. లక్ష్మీమీనన్‌ హీరోయిన్. డి.ఇమాన్‌ స్వరాలు సమకూర్చారు.


  విశాల్‌ మాట్లాడుతూ ''ఇప్పటిదాకా హీరోగానే మాట్లాడాను. తొలిసారి నిర్మాతగా మాట్లాడుతున్నాను. ఈ సినిమా వెనక చాలా కష్టం ఉంది. అదంతా ఇష్టంతోనే చేశాను. ప్రతీ హీరో జీవితంలోనూ ఓ మలుపు అనేది ఉంటుంది. అది దర్శకుడితోనే వస్తుంది. ఈ కథ విన్నాక కూడా నాకు ఓ మంచి మలుపునిచ్చే చిత్రమవుతుందనిపించింది. నాలో ఆవేశం, సినిమాపై వున్న ప్రేమవల్ల నిర్మాతనయ్యాను. 'పల్నాడు' అందరినీ ఆకట్టుకొనే ఓ మంచి చిత్రమవుతుంది. ఇక తెలుగు సినిమా గురించి ప్రతీసారీ చెబుతూనే ఉన్నాను. నేను నిర్మాతగా మారడం వల్లే నా తెలుగు సినిమా ఆలస్యమైంది. త్వరలోనే ఆ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నా'' అన్నారు.

  అలాగే "దీపావళికి తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. ఎవరికైనా ఏదో ఒక సమయంలో టర్నింగ్ పాయింట్ వస్తుంది. సుశీంద్రన్ ఈ కథ చెప్పినప్పుడే ఇది అలాంటి కథ అనిపించింది. నా కెరీర్‌కు ఇది చాలా ముఖ్యమైన చిత్రం.ఇప్పటికే మా కుటుంబానికి ఓ బ్యానర్ ఉన్నప్పటికీ, ఈ సినిమా నిర్మాణాన్ని నేనే స్వయంగా చూసుకోవాలనే ఉద్దేశంతో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీని ఏర్పాటుచేశాను. వచ్చే సంక్రాంతికి తెలుగులో శశి దర్శకత్వంలో ఓ స్ట్రయిట్ సినిమా చేయబోతున్నా'' అని చెప్పారు.

  సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ ''విశాల్‌ నాకు ఓ అన్నయ్యతో సమానం. ఎప్పట్నుంచో ఆయన సినిమాలు చూస్తున్నాం. ఎంతో అణిగిమణిగి ఉంటారు. సుశీంద్రన్‌ దర్శకత్వం అంటే నాకు చాలా ఇష్టం. తను పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా తీస్తుంటాడు. పాటలు, ప్రచార చిత్రాలు చాలా బాగున్నాయి. తప్పకుండా ఇదొక మంచి చిత్రమవుతుంది''అన్నారు. మహత్‌ రాఘవేంద్ర మాట్లాడుతూ ''విశాల్‌ నాకు మంచి మిత్రుడు. సినిమాకోసం ఎంతైనా కష్టపడతుంటారు. సిక్స్‌ ప్యాక్‌ చేయమన్నా చేస్తారు, ఇటున్న కళ్లను అటువైపు తిప్పడానికైనా సిద్ధపడతారు. నిర్మాతగా, హీరోగా విశాల్‌ ఎంతో ఇష్టపడి చేసిన ఈ చిత్రం తప్పకుండా ఒక మంచి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం నాకుంది'' అన్నారు.

  తులసి, ప్రకాశ్, విక్రాంత్, సూరి, భారతీరాజా తారాగణమైన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మది, కూర్పు: ఆంటోని, కళ: రాజీవన్, ఫైట్స్: అణల్ అరసు, నిర్మాణ సారథ్యం: వడ్డి రామానుజం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుశీంద్రన్

  English summary
  Vishal who is in a desperate need of a hit movie, says his upcoming action-drama "Palnaadu" is a very important project in his career as everything worked in his favour while he was filming for it. "I'm sure even if Suseenthiran (director) and I do another film together, it will not come out as good as this film. Everything so far with regards to the film has worked in my favour, and therefore, I consider it a very important film in my career," Vishal told media.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more