»   » భార్యకు సంగీత దర్శకుడు విడాకులు.. ప్రైవసీకి భంగం కలిగించొద్దు

భార్యకు సంగీత దర్శకుడు విడాకులు.. ప్రైవసీకి భంగం కలిగించొద్దు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ సెలబ్రిటీలు ఫర్హాన్ అఖ్తర్ అధునా భాభని, అర్భాజ్ ఖాన్ మలైకా అరోరా దంపతుల జాబితాలో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు విశాల్ దల్దానీ ప్రయాలీ కపూర్ దంపతులు చేరారు. తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు ఇటీవల విశాల్ పిటిషన్ దాఖలు చేశారు.

 విడాకుల కోసం విశాల్ పిటిషన్

విడాకుల కోసం విశాల్ పిటిషన్


వ్యక్తిగత విభేదాల కారణంగా కొంత కాలంగా వేర్వేరుగా ఉంటున్న వీరిద్దరూ విడిపోవడానికి నిశ్చయించుకొన్నారు. ఈ నేపథ్యంలో తామిద్దరం ఆరేండ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలుకాలని నిశ్చయించుకొన్నామని విశాల్ ఓ ప్రకటనలో తెలిపారు.

 కొన్నేండ్లుగా విడివిడిగా ఉంటున్నాం

కొన్నేండ్లుగా విడివిడిగా ఉంటున్నాం


‘కొన్నేండ్లుగా ప్రియాలీ నేను విడివిడిగా ఉంటున్నాం. అధికారికంగా విడిపోవడానికి నేను కోర్టులో పిటిషన్ దాఖలు చేశాను. ఇది పూర్తిగా వ్యక్తిగతం, ప్రైవేటు వ్యవహారం. అయితే ఇద్దరి కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దు. తమ ప్రతిష్ఠకు భంగం కలిగించవద్దు అని వేడుకుంటున్నాను. థ్యాంక్స్'అని ప్రకటనలో పేర్కొన్నారు.

 సంగీత ద్వయం విశాల్ శేఖర్

సంగీత ద్వయం విశాల్ శేఖర్


సంగీత ద్వయం విశాల్-శేఖర్ లో ఈయన ఒకరని తెలిసిన సంగతి తెలిసిందే. ఇటీవల సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ చిత్రానికి వీరద్దరూ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. తాజాగా రణ్ వీర్ సింగ్, వాణీ కపూర్ నటించిన బేఫిక్రే చిత్రానికి కూడా సంగీతాన్ని అందించారు.

రణబీర్, కత్రినా ఒకరికొకరు గుడ్ బై

రణబీర్, కత్రినా ఒకరికొకరు గుడ్ బై

బాలీవుడ్‌లో ఇటీవల కాలంలో భార్యభర్తలే కాకుండా ప్రేమికులు కూడా ఒకరికొకరు గుడ్ బై చెప్పుకొంటున్న సంఘటనలు ఎక్కువగానే ఉన్నాయి. ఇటీవల రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్ కూడా విడిపోయిన సంగతి తెలిసిందే.

English summary
Vishal Dadlani announced that After several years of living separately, Priyali and I are officially filing for divorce.
Please Wait while comments are loading...