'ఎన్‌టీఆర్ 'అంటే అర్దం ఏమిటంటే... : విశాల్
ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మదగజరాజా ఫెస్టివల్ చిత్రమని దర్శకుడు సుందర్.సి అంటుండేవారు. అదే విధంగా ఈ చిత్రాన్ని వినాయకచతుర్థి సందర్భంగా విడుదలకు సిద్ధం చేస్తున్నాం. మరో ముఖ్య విషయం ఏమిటంటే సరిగ్గా సెప్టెంబర్ ఆరుకి విశాల్ పరిశ్రమకు వచ్చి దశాబ్దం పూర్తవుతుంది. ఈ సందర్భంగా తన సొంత సంస్థలో తను నటించిన చిత్రం విడుదల కావడం విశేషంగా భావిస్తున్నానని చెప్తున్నారు. విజయ్ ఆంటోనీ సంగీతం సమకూర్చారు.
ఇక నయనతార హీరోయిన్ గా నటించిన 'సెల్యూట్ 'లో విశాల్ తొలిసారిగా ఆరుపలకల దేహంతో కనిపించారు. సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు మళ్లీ అదే దేహధారణతో తెరపైకి రానున్నాడు. సిక్స్ ప్యాక్ కు మారటంపై విశాల్ మాట్లాడుతూ... అందరూ మాట్లాడుకునేందుకు నేను ఇలా చేయడం లేదు. అందుకు ప్రధాన కారణం కథే. 'సత్యం'కు అలాంటి శరీరాకృతి అవసరమైంది. ఇప్పుడు 'మదగజరాజ'కు కూడా అవసరమైంది. ఇందుకోసం చాలా శ్రమించాల్సి ఉంటుంది. నెలల కొద్దీ వ్యాయామం చేస్తేనే అలాంటి ఆకృతి వస్తుంది. ఆహారపదార్థాల నియంత్రణ చాలా ముఖ్యం. సిక్స్‌ప్యాక్‌తో శరీరంలో నీటిశాతం తగ్గిపోతుంది. ఇతర సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని చెప్పాడు.
చిత్రం గురించి విశాల్ చెప్తూ... 1980లో రజనీకాంత్ రాజాధిరాజా, కమలహాసన్ సకలకళా వల్లభన్ తరహాలో చిత్రం చేయాలని దర్శకుడు సుందర్.సి, నేను భావించాం. అలాంటి పుల్ జాయ్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ఈ మదగజరాజా. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ అంటూ అన్ని జనరంజక అంశాలున్న చిత్రమిది. ఊటీలో కేబుల్ ఆపరేటర్‌గా నటిం చాను. ఆ పాత్ర ఎదుర్కొన్న సంఘటనల సమాహారమే చిత్రంఅన్నారు. సుందర్.సి మాట్లాడుతూ.. యాక్షన్, హాస్యం కలగలసిన చిత్రమిది. విశాల్‌కు తగ్గ కథ. ఇందుకోసం ఆయన చాలా రకాల ఆహారాలు కూడా మానేశారు. చాలా శ్రమించి నటించారని చెప్పారు.


Click it and Unblock the Notifications












