twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హరికృష్ణ, ఎన్టీఆర్ కలసి నటించాల్సిన సినిమా ఇదే.. కోట్లు ఇచ్చినా కుదరదని చెప్పేశాడు!

    |

    యంగ్ టైగర్ ఎన్టీఆర్, హరికృష్ణ కలయికలో సినిమా వస్తే ఎలా ఉండేది. మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ నటిస్తే అది క్రేజీగా మారడం ఖాయం. కానీ ఇక ఆ అదృష్టం లేదు. హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి కలయికలో సినిమా కోసం దర్శక నిర్మాతలు 13 ఏళ్ల క్రితమే నిర్మాతలు ప్రయత్నాలు మొదలు పెట్టారంటే నమ్మగలరా. నమ్మాల్సిందే. ఎందుకంటే ఆసక్తికరమైన సంగతుల్ని విశాల్ తాజగా బయట పెట్టాడు.

     తమిళంలో సూపర్ హిట్

    తమిళంలో సూపర్ హిట్

    మనందరికీ తెలిసి.. విశాల్ తమిళనాడుకు చెందిన వ్యక్తి అయినప్పటికీ అతడి కుటుంబ నేపథ్యం ప్రకారం తెలుగు వాడు కూడా. 2005 లో పందెం కోడి చిత్రంలో నటించిన రాయలసీమ యువకుడిలా మెప్పించాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన తరువాత ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు.

     13 ఏళ్ల తరువాత సీక్వెల్

    13 ఏళ్ల తరువాత సీక్వెల్

    పందెం కోడి చిత్రం విడుదలైన 13 ఏళ్ల తరువాత ఈ చిత్ర సీక్వెల్ పందెం కోడి 2 విడుదలవుతోంది. తాజగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పందెం కోడి చిత్రం గురించి విశాల్ పలు ఆసక్తికర విశేషాలు వెల్లడించాడు.

     ఎన్టీఆర్ కోసం

    ఎన్టీఆర్ కోసం

    పందెం కోడి తమిళంలో విడుదలైన సూపర్ హిట్ అయింది. రీమేక్ హక్కుల కోసం టాలీవడ్ దర్శకనిర్మాతలు ఎగబడ్డారు. కానీ ఈ చిత్రాన్ని మరొకరికి ఇవ్వడానికి మానాన్న అంగీకరించలేదని విశాల్ తెలిపాడు. ఎన్టీఆర్, హరికృష్ణ కాంబినేషన్ లో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తామని కొందరు భారీ మొత్తం ఆఫర్ చేశారు. ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ చిత్రాన్ని మరొకరికి ఇవ్వనని నాన్న చెప్పేశారు.

    ఇంతకంటే మంచి కథ

    ఇంతకంటే మంచి కథ

    నా కొడుకుని తెలుగులో లాంచ్ చేయడానికి ఇంతకంటే మంచి కథ దొరకదు. అందుకే రీమేక్ రైట్స్ ఎవరికీ ఇవ్వను. ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తాం అని నాన్న అప్పట్లో చెప్పేశారు. నాన్న తీసుకున్న నిర్ణయం వలెనే ఈ రోజు తెలుగు ప్రేక్షకుల ముందు ఇలా ఉన్నానని విశాల్ తెలిపాడు.

     రాంచరణ్ కూడా

    రాంచరణ్ కూడా

    ఎన్టీఆర్ కోసం మాత్రమే కాదు, రాంచరణ్ కోసం కూడా కొందరు రీమేక్ హక్కులు అడిగారు. ఇలా పెద్ద పెద్ద కాంబినేషన్స్ వచ్చినా నాన్న ఒప్పుకోలేదని తెలిపాడు. నాన్న, అన్నయ్య వలనే నేను ఈ స్థాయిలో ఉన్నానని విశాల్ తెలిపాడు. ఎన్టీఆర్, హరికృష్ణ కాంబినేషన్ లో సినిమా అలా మిస్సయింది అన్నమాట.

    English summary
    Vishal opens up about Ram Charan and NTR. If he not Pandem kodi for Ram Charan and NTR
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X