»   » సెక్సీ థ్రిల్లర్, అడుగడుగునా అవే సీన్స్ ...రేపే రిలీజ్

సెక్సీ థ్రిల్లర్, అడుగడుగునా అవే సీన్స్ ...రేపే రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: 'హేట్‌ స్టోరీ' కి సీక్వెల్‌గా విశాల్‌ పాండ్య దర్శకత్వంలో 'హేట్‌ స్టోరీ 2' రూపొందింది. దానికీ ప్రేక్షకాదరణ దక్కడంతో విశాల్‌ తాజాగా 'హేట్‌ స్టోరీ 3' తెరకెక్కించారు. ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

'త్రీ ఇడియట్స్‌'తో గుర్తింపు తెచ్చుకున్న శర్మాన్‌ జోషి, 'ఎలోన్‌'లో బిపాసా బసుకు జోడీగా కనిపించిన కరణ్‌ గ్రోవర్‌, 'వీర్‌'తో సల్మాన్‌ ఖాన్‌ పరిచయం చేసిన జరైన్‌ ఖాన్‌, 'జై హో'లో నటించిన డైసీషా ప్రధాన పాత్రల్లో నటించారు.

మూడేళ్ల కిందట వచ్చిన 'హేట్‌ స్టోరీ' బాక్సాఫీసు వద్ద సెగ పుట్టించిందో మనకు తెలసిందే. ఇక 'హేట్‌ స్టోరీ 2'లో సుర్వీన్‌ చావ్లా తడి తడి అందాలతో అదరగొట్టింది. తొలి భాగాన్ని మించి ఈ చిత్రం విజయం సాధించింది. ఇప్పుడు 'హేట్‌ స్టోరీ 3' ట్రైలర్‌ చూస్తే గత రెండు భాగాలను తలదన్నేలా ఇందులో జరైన్‌ ఖాన్‌ రెచ్చిపోయిందని అనుకుంటున్నారు.

Vishal Pandya’s “Hate Story 3” preview

చిత్రం కథేంటి: ఆదిత్య సింగ్‌(శర్మాన్‌) కుటుంబానికి సొంత కంపెనీ ఉంటుంది. అతని భార్య సియా సింగ్‌(జరైన్‌). ఆదిత్య తన అన్న విక్రమ్‌ ప్రమాదంలో మరణించడంతో తనే కంపెనీ బాధ్యతలు తీసుకుంటాడు. అతని సెక్రటరీగా కావ్య(డైసీ) పనిచేస్తుంటుంది. సౌరవ్‌ సింఘానియా(కరణ్‌) అనే మరో బిజినెస్‌మేన్‌ ఆదిత్య, సియాలతో పరిచయం పెంచుకుంటాడు.

తన కంపెనీని ఆదిత్య కంపెనీలో విలీనం చేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఇలా ఉండగా సౌరవ్‌ కావ్యతో చనువుగా మెలుగుతుంటాడు. వారిద్దరూ ప్రేమలో పడతారు. అయితే ఆదిత్య కంపెనీని దెబ్బకొట్టేందుకే సౌరవ్‌ తనను ఉపయోగించుకున్నట్లు కావ్యకు తెలుస్తుంది.

అప్పటికే ఆదిత్యకు తీవ్ర నష్టం వచ్చి ఉంటుంది. అసలు సౌరవ్‌ బిజినెస్‌మేనే కాదన్న నిజం వారికి తెలుస్తుంది. సౌరవ్‌ ఎందుకు నాటకమాడాడు? ఆదిత్యతో సౌరవ్‌కు శత్రుత్వం ఎందుకు? నిజం తెలుసుకున్న ఆదిత్య, సియా ఎలా ప్రతీకారం తీర్చుకున్నారన్నది తెరపై చూడాలి.

English summary
Vishal Pandya’s “Hate Story 3”, starring Zareen Khan, Karan Singh Grover, Daisy Shah and Sharman Joshi is touted as a sex thriller.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu