»   » విశాల్‌ తెలుగులో మళ్లీ...ఇదిగో ఫస్ట్‌లుక్‌

విశాల్‌ తెలుగులో మళ్లీ...ఇదిగో ఫస్ట్‌లుక్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: తమిళ హీరో విశాల్‌ సినిమాలు తెలుగులోనూ డబ్బింగ్ అయ్యి రిలీజ్ అవుతూంటాయి. విశాల్ ఇక్కడ వాడే కావటం, అతని పందెం కోడి, భరణి, సెల్యూట్, వాడూ-వీడు చిత్రాలు బాగానే ఆడటం కూడా బిజినెస్ వర్గాల్లో క్రేజ్ ఉంది.

తాజాగా విశాల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'పాయుంపులి'ని తెలుగులో డబ్‌చేసి 'జయసూర్య'గా విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌నినటుడు విశాల్‌ ట్విట్టర్లో విడుదల చేశారు. సెప్టెబర్‌ 4న ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు విశాల్‌ ప్రకటించారు. ఆ ఫస్ట్ లుక్ ని ఇక్కడ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

విశాల్ ‘జయసూర్య' (06-Aug-2015)

పందెంకోడి, పొగరు, భరణి, పూజ, మగమహారాజు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో విశాల్ మరో చిత్రంతో టాలీవుడ్‌కు దగ్గరవుతున్నాడు. సుశీంద్రన్ దర్శకత్వంలో ‘పాయుమ్ పులి'గా తమిళంలో రూపొందుతున్న చిత్రం తెలుగులో ‘జయసూర్య'గా విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని సర్వానంద రామ్ క్రియేషన్స్ పతాకంపై వడ్డి రామానుజం సారధ్యంలో జివ్వాజి రామాంజనేయులు తెలుగు ప్రేక్షకులను అందిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

 Vishal's Jayasurya first look

ఈ చిత్రంలో విశాల్ సరసన కాజల్ జంటగా నటించింది. విశాల్ ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఆగస్ట్ 21 చిత్ర ఆడియోను విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

విశాల్, కాజల్ అగర్వాల్, సముద్రఖని, సూరి, హారీష్ ఉత్తమన్, మురళీశర్మ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతం అందించారు.

English summary
Vishals's upcoming movie is Jayasurya and it is directed by Sushindran. Kajal is the heroine of this film.
Please Wait while comments are loading...