»   » ‘రుద్రమదేవి’తో పాటే హీరో విశాల్ కొత్తమూవీ రిలీజ్

‘రుద్రమదేవి’తో పాటే హీరో విశాల్ కొత్తమూవీ రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పందెం కోడి, పొగరు, భరణి, పూజ, మగమహారాజు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో విశాల్ కథానాయకుడిగా సుశీంద్రన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో మరో యాక్షన్ ఎంటర్టెనర్ రూపొందుతోంది. తమిళ్ లో ‘పాయుమ్ పులి'గా, తెలుగులో ‘జయసూర్య'గా ఈచిత్రం విడుదలవుతుంది.

సర్వానంద రామ్ క్రియేషన్స్ పతాకంపై వడ్డి రామానుజం సారథ్యంలో రూపొందుతున్న ‘జయసూర్య' చిత్రాన్ని జవ్వాజి రామాంజనేయులు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 4న తమిళం, తెలుగులో విడుదలవుతోంది.

Vishal's Jayasurya release on 4 September

ఈ సందర్భంగా హీరో విశాల్ మాట్లాడుతూ...‘ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాను. మంచి మాస్ ఎలిమెంట్స్ తో పవర్ ఫుల్ సబ్జెక్టుతో రూపొందుతున్న ఈ సినిమా నా కెరీర్ కు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది' అన్నారు.

నిర్మాత జవ్వాజి రామాంజనేయులు మాట్లాడుతూ...‘విశాల్, కాజల్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున నిర్మాణం జరుపుకుంటున్న చిత్రమిది. సెప్టెంబర్ 4న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. ఆగస్టు 21న ‘జయసూర్య' ఆడియోను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా ఈ సినిమా హీరో విశాల్ కు, మా బేనర్ కు సూపర్ హిట్ మూవీ అవుతుందన్న నమ్మకం ఉంది' అన్నారు.

Vishal's Jayasurya release on 4 September

విశాల్, కాజల్ అగర్వాల్, సముద్రఖని, సూరి, హరీష్ ఉత్తమన్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమాన్, సినిమాటోగ్రఫీ: వేల్ రాజ్, మాటలు: శశాంక్ వెన్నెల కంటి, ఎడిటింగ్: ఆంటోని, పాటలు: సాహితి, వన్నెలకంటి, రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్, సారథ్యం: వడ్డి రామానుజం, తెలుగులో రిలీజ్ చేస్తున్న నిర్మాత: జువ్వాజి రామాంజనేయులు దర్శకత్వం: సుశీంద్రన్.

English summary
Vishal's up coming movie 'Jayasurya' release on 4 September.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu