»   » విశాల్‌ 'కథాకళి' ఎప్పుడంటే

విశాల్‌ 'కథాకళి' ఎప్పుడంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: విశాల్‌, కేథరిన్‌ త్రేసా జంటగా పాండిరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళచిత్రం 'కథాకళి' . ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్ ఇప్పటికే విడుదలై ప్రాజెక్టుకు మంచి క్రేజ్ తెచ్చాయి. ఈ చిత్రాన్ని విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, పసంగా ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

నటుడు విశాల్ సొంత చిత్ర నిర్మాణం నెలకొల్పి పాండియనాడు, నాన్ శివప్పు మనిదన్, పూజై అంటూ వరుస చిత్రాలను నిర్మిస్తూ విజయాలను అందుకుంటున్నారు యువ దర్శకుడు పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చినట్లే.

ఇప్పటి వరకు పసంగ, మెరీనా, వంశం అంటూ సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు పాండిరాజ్ తొలిసారిగా విశాల్ వంటి మాస్ హీరోతో యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధం అవుతున్నారు. మరి ఈ చిత్రంలో విశాల్‌ను ఎలా చూపించనున్నారో వేచి చూడాల్సిందే అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Vishal's Kathakali to Release This January 2016

దర్శకుడు పాండి రాజ్ మాట్లాడుతూ.., "మీ అందరి ఆశీస్సులతో...నా తదుపరి చిత్రం కథాకళి ప్లాన్ చేసాను. ఈ చిత్రం విశాల్ ఫిల్మ్ ప్యాక్టరీ మరియు పసంగ ప్రొడక్షన్స్ కలిపి నిర్మిస్తాయి. ఇది జాయింట్ వెంచర్" అన్నారు.

ఇక కథాకళి చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో విశాల్ తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. కొంబన్ చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు ముత్తయ్య ఇప్పుడు విశాల్‌ను డెరైక్ట్ చేయనున్నారు. ఈ చిత్రానికి మరుదు అనే పేరును ఖరారు చేశారు.

Vishal's Kathakali to Release This January 2016

 
దర్శకుడు ముత్తయ్య ఇంతకు ముందు చేసిన కుట్టిపులి, కొంబన్ చిత్రాలలో హీరోయిన్‌గా నటించిన లక్ష్మిమీనన్‌నే ఈ మరుదు చిత్రంలో హీరోయిన్ గా నటింపజేయాలని భావించినట్లు సమాచారం.

అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా నటి శ్రీదివ్యను ఆ అవకాశం వరించింది. మరో విషయం ఏమిటంటే ఇటీవల జరిగిన దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల్లో కార్యదర్శి పదవికి పోటీ పడి ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శించుకున్న విశాల్, రాధారవి ఈ చిత్రంలో నాయకుడు, ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. మరుదు చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.

English summary
Vishal's upcoming movie KATHAKALI is going to release for Pongal 2016. Catherine Tresa, Nassar, Soori, Sreejith Ravi and Pawan are casting in this movie Director and Producer Pandiraj and also produced by Vishal is going to release on 14th Jan 2016.
Please Wait while comments are loading...