twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాస్ మసాలాతోనే క్రేజు (‘మగ మహారాజు’ ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్‌: 'పందెంకోడి', 'పొగరు', 'వాడు వీడు', 'పూజ'... చిత్రాలతో హీరోగా నిరూపించుకొన్నారు విశాల్‌. నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టి విజయాలు సాధిస్తున్నారు. విశాల్‌ నటించిన 'మగమహారాజు' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం తమిళంలో రిలీజై మంచి హిట్టై,అక్కడ డబ్బులు తెచ్చిపెట్టింది. దాంతో తెలుగులోనూ ఈ చిత్రం వర్కవుట్ అవుతుందని భావిస్తున్నాడు. విశాల్ గత చిత్రం పూజ మంచి విజయం సాధించటంతో ‘మగ మహారాజు' మంచి బిజినెస్ జరిగింది. చాలా కాలంగా హిట్ కు దూరంగా ఉన్న విశాల్ ఈ చిత్రంలో మళ్లీ ఇక్కడ మార్కెట్ పెరుగుతుందని భావిస్తున్నాడు. తమిళంలో రూపొంది హిట్టైన ‘ఆంబల'కు ఇది తెలుగు రూపం.

    ఇందులో హీరో విశాల్ తండ్రికి ముగ్గురు అక్కలుంటారు. ఎప్పుడో విడిపోయిన ఈ కుటుంబాలను ఒకటి చేసేందుకు హీరో ఎటువంటి ప్రయత్నాలు చేశాడనేది కథ. రమ్యకృష్ణ, కిరణ్‌రాథోడ్‌, ఐశ్వర్య విశాల్ కు అత్తలుగా నటించారు. హన్సికతో విశాల్ చేసిన తొలి చిత్రమిది. బాయ్‌ నెక్స్ట్‌ డోర్‌ అనేలా ఆ పాత్ర ఉంటుంది. ప్రతి ఒక్కరికీ ఈజీగా కనెక్ట్‌ అవుతుంది. మాస్‌, యాక్షన్‌ ఎలిమెంట్స్‌తోపాటు చక్కని కుటుంబ విలువలు ఉన్న సినిమా ఇది. సంతానం కామెడీ హైలైట్‌గా నిలుస్తుంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Vishal's Maga Maharaju preview

    విశాల్ మాట్లాడుతూ...పక్కా పైసా వసూల్‌ సినిమా ఇది. సుందర్‌ సి. సినిమా అంటే వినోదం పుష్కలంగా ఉంటుంది. దాంతో పాటు నా నుంచి ఆశించే పోరాట ఘట్టాలూ ఈ సినిమాలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా చివరి ఇరవై నిమిషాలూ సందడి సందడిగా ఉంటుంది. నిజంగా రమ్యకృష్ణలాంటి సీనియర్‌ నటితో నటించడం గొప్ప అవకాశం. ఈ సినిమాలో మేమిద్దరం ఛాలెంజ్‌లు విసురుకొనే సన్నివేశాలు ఆకట్టుకొంటాయి అన్నారు.

    తెలుగులో కాస్త ఆలస్యంగా తీసుకొస్తున్నారనే దానికి కారణం చెప్తూ.... జనవరిలోనే ఈ సినిమా విడుదల కావాలి. అయితే 'ఐ', 'గోపాల గోపాల' ఉన్నాయి కదా. అందుకే మాకు కావాల్సిన సంఖ్యలో థియేటర్లు దొరకలేదు. అయితే ఈ వారమూ గట్టిపోటీ ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సోలోగా రావడం కుదరదు. ప్రతీ శుక్రవారం నాలుగైదు సినిమాలొస్తున్నాయి. వాటిలో మనమేంటో నిరూపించుకోవడానికి కష్టపడాలి. తమిళంలో విజయం సాధించింది. తెలుగులోనూ అలాంటి ఫలితమే వస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు.

    హన్సిక మాట్లాడుతూ- సుందర్‌గారి దర్శకత్వంలో నేను చేస్తున్న మూడో సినిమా ఇది. మంచి పాత్ర ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలుస్తుంది అన్నారు.

    చిత్రం: ‘మగ మహారాజు'
    బ్యానర్: విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ
    నటీనటులు: విశాల్, హన్సిక, మధురిమ, మాధవీలత , వైభవ్‌, రమ్యకృష్ణ, ఐశ్వర్య, కిరణ్‌ రాథోడ్‌ తదితరులు
    కెమెరా: గోపి అమర్‌నాథ్‌,
    సంగీతం: హిప్‌ హాప్‌ తమిళ,
    ఎడిటింగ్‌:ఎన్‌.బి.శ్రీకాంత్‌,
    ఫైట్స్‌: కణల్‌ కణ్ణన్‌,
    మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి,
    పాటలు: చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి, వెన్నెలకంటి, శ్రీమణి, సాహితి,
    ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వడ్డి రామానుజం,
    నిర్మాత: విశాల్‌,
    స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుందర్‌.సి.
    విడుదల తేదీ : 27,02,2015.

    English summary
    Vishal, Hansika's hit Tamil film ‘Ambala’ is releasing in Telugu as ‘Maga Maharaju’. Film directed by Sundar.C is readying for grand release on Feb. 27th (today).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X