»   » బాలయ్యకు, చిరు కు దొరక్కుండా యూటర్న్, అసలు కథేంటి? (విశాల్ 'ఒక్కడొచ్చాడు' ప్రివ్యూ)

బాలయ్యకు, చిరు కు దొరక్కుండా యూటర్న్, అసలు కథేంటి? (విశాల్ 'ఒక్కడొచ్చాడు' ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో అన్ని పరిశ్రమలతో పాటు సినీ పరిశ్రమకు కూడా పెద్ద దెబ్బే పడింది. ఇప్పటికే కొన్ని సినిమా షూటింగ్‌లు రద్దు కాగా, రిలీజ్ కావలసిన సినిమాల దారెటో అర్దం కాకుండా పోయింది. అలాగని రిలీజ్ వాయిదా వేసుకుంటే...సంక్రాంతికి రిలీజ్ అవుతున్న చిరంజీవి 150 వ చిత్రం, బాలయ్య 100 వ చిత్రం ల మధ్య నలగిపోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఆలోచించే ...విశాల్ ఓ నిర్ణయం తీసుకుని , ఈ రోజే మన ముందుకు వచ్చేస్తున్నాడు.

మాస్‌ హీరో విశాల్‌, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా రూపొందుతున్న కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఒక్కడొచ్చాడు'. సూరజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జి. హరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హిప్‌హాప్‌ సంగీతం సమకూరుస్తున్నారు. వడివేలు, జగపతిబాబు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.

అక్కడో చోటే కాదు..

అక్కడో చోటే కాదు..

విశాఖతీరంలోని సుబ్రమణ్యపురం అనే గ్రామం చుట్టూ నడిచే కథ ఇది. అక్కడ నివసించే సగటు పౌరుడు అర్జున్‌ రామకృష్ణ (విశాల్‌). ఆ గ్రామంలో ఒక్క పనీ సవ్యంగా జరగదు. వూరికి రావాల్సిన నిధుల్ని పెద్దవాళ్లంతా కలసి స్వాహా చేస్తుంటారు. ఈ సమస్య ఆ ఒక్క వూరిదే కాదు. దేశం మొత్తానిది అని గ్రహిస్తాడు అర్జున్‌.

నల్లదొంగల ఆట..

నల్లదొంగల ఆట..

దాంతో హీరో విశాల్ ...పట్నం వస్తాడు. అక్కడ కొన్ని సమస్యలపై పోరాటం చేస్తాడు. అందులో భాగంగా నల్లదొంగల ఆట ఎలా కట్టించాడన్నదే చిత్ర కథ. డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ చంద్రబోస్‌ (జగపతి)ని అర్జున్‌ ఎలా ఢీ కొట్టాడు..? చంద్రబోస్‌ చెల్లాయి (తమన్నా)తో ప్రేమను ఎలా గెలిచాడు? అనేది తెరపై చూడాలి.

నిర్మాత హరి మాట్లాడుతూ...

నిర్మాత హరి మాట్లాడుతూ...

‘‘ఓ మంచి పని కోసం హీరో చేసే పోరాటం ఈ చిత్రం. నాలుగు యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఉన్నాయి. కనల్‌ కన్నన్‌ ఓ ఛేజింగ్‌ సన్నివేశాన్ని హాలీవుడ్‌ స్థాయిలో తీశారు. రెండు పాటల్ని రష్యాలో తెరకెక్కించాం. దాదాపుగా రూ.40 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కించాం. వడివేలు హాస్యం ప్రధాన ఆకర్షణ. విశాల్‌, తమన్నాల మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ కొత్తగా తెరకెక్కించాం. జగపతిబాబు పాత్రలో చాలా షేడ్స్‌ ఉంటాయి ''అన్నారు.

బర్తడే గిప్ట్

బర్తడే గిప్ట్

‘విశాల్ హీరోగా నేను నటించిన ‘ఒక్కడొచ్చాడు' సినిమా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ సినిమాలో పాటలలో నన్ను ప్రత్యేకంగా చూపించారు. లిరిక్ కూడా అంతే ప్రత్యేకంగా రాయించారు. ఈ సినిమా ఓ రకంగా నా అభిమానులకు బర్త్‌డే గిఫ్ట్‌లాంటిది' అని నటి తమన్నా తెలిపారు.

యాక్షన్ పాక్డ్ అయినా

యాక్షన్ పాక్డ్ అయినా

జగపతిబాబు చెల్లెలుగా ఈ సినిమాలో నటించాను. నటనకు పూర్తి అవకాశం వున్న ప్రాధాన్యమైన పాత్ర నాది. కమర్షియల్ యాక్షన్ పాక్డ్ మూవీ అయినాగానీ అన్ని హంగులూ ఉన్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు ప్రేక్షకులకు ఓ సందేశం కూడా వుంటుంది. ఈ చిత్రం నా బర్త్‌డే టైమ్‌లో విడుదల కావడం మరింత ఆనందాన్నిస్తోంది అని చెప్పింది తమన్నా.

జాగ్రత్తలు..

జాగ్రత్తలు..

నిర్మాత హరి ఈ సినిమా ప్రారంభం నుండి మాతోనే ట్రావెల్ అవుతున్నారు. ఓవైపు తమిళం, మరోవైపు తెలుగు సినిమా షూటింగ్‌లో ఆయన తీసుకున్న జాగ్రత్తలు ఈ సినిమాకు ఎంతో ఉపకరించాయి. తెలుగులో నేటివిటీ ఉన్నట్లుగానే తీర్చిదిద్దటంలో ఆయన తీసుకున్న జాగ్రత్తలు సినిమా చూస్తే అర్థమవుతాయి. పాటల చిత్రీకరణ, ట్రైలర్ల విడుదల సమయంలోనే కాక సినిమా ప్రమోషన్ విషయంలో కూడా ఆయన శ్రద్ధ తీసుకున్నారు అన్నారు హీరో విశాల్.

విశాల్ ఏమంటాడంటే...

విశాల్ ఏమంటాడంటే...

'సమాజంలోని ప్రతి మనిషి మైండ్‌కు ఓ వాయిస్‌ ఉంటుంది. ఆ మైండ్‌వాయిస్‌తో ఈ సినిమాలో మాట్లాడే అవకాశం వచ్చింది. సినిమాలో చివరి 30 నిమిషాలు ఓ విషయం చెబుతున్నాను. అది ఏమిటనేది సినిమా చూస్తే తెలుస్తుంది. హిప్‌హాప్‌ మంచి సంగీతం అందించారు. ఈ సినిమా నా కెరీర్‌లో మరో సూపర్‌ హిట్‌ అవుతుంది' అన్నారు హీరో విశాల్.

ఐదేళ్ల తర్వాత

ఐదేళ్ల తర్వాత

'లవ్‌, యాక్షన్‌, కామెడి ఇలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. దర్శకుడు సూరాజ్‌, తమన్నాలతో మొదటిసారి కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. సినిమా బాగా రావాలని మొత్తం యూనిట్‌ సభ్యులు కష్టపడ్డాం. వడివేలు ఐదేళ్ల తర్వాత ఈ సినిమాతో రెండో ఇన్నింగ్స్‌ ఎంట్రీ ఇస్తున్నారు' అన్నారు విశాల్.

హయ్యిస్ట్ బడ్జెట్

హయ్యిస్ట్ బడ్జెట్

నిర్మాత జి.హరి మాట్లాడుతూ - ''మా 'ఒక్కడొచ్చాడు' చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌ పొందింది. హీరో విశాల్‌ కెరీర్‌లోనే ఫస్ట్‌ టైమ్‌ క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌ పొందిన సినిమా ఇదే. డిసెంబర్‌ 23న వరల్డ్‌వైడ్‌గా తెలుగు, తమిళ భాషల్లో 2,100 థియేటర్లలో చాలా గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. విశాల్‌ కెరీర్‌లో హయ్యస్ట్‌ బడ్జెట్‌తో చాలా లావిష్‌గా నిర్మించిన ఈ చిత్రం అతని కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ సినిమా అవుతుంది. యాక్షన్‌తోపాటు మంచి మెసేజ్‌తో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా పెద్ద విజయాన్ని సాధిస్తుంది. '' అన్నారు.

చిత్ర దర్శకుడు సురాజ్‌ మాట్లాడుతూ ...

చిత్ర దర్శకుడు సురాజ్‌ మాట్లాడుతూ ...

''ఇది ఒక స్టైలిష్‌ ఎంటర్‌టైనర్‌. విశాల్‌గారి పెర్‌ఫార్మెన్స్‌, తమన్నా డాన్స్‌ అందర్నీ అలరిస్తుంది. జగపతిబాబుగారు ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర పోషించారు. హిప్‌హాప్‌ తమిళ మ్యూజిక్‌ ఎక్స్‌లెంట్‌గా చేశారు. ఆల్రెడీ పాటలు చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా సూపర్‌గా చేశారు. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు మంచి మెసేజ్‌ కూడా వుంటుంది. ప్రతి ఒక్కరికీ 'ఒక్కడొచ్చాడు' ఓ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌నిస్తుంది'' అన్నారు దర్శకుడు సూరజ్.

తొలిసారి విశాల్ తో

తొలిసారి విశాల్ తో

హీరో విశాల్‌తో తొలిసారిగా ఈ సినిమాలో కలిసి నటించాను. విశాల్ ఎప్పుడు ఏ సినిమా చేసినా ఆ సినిమా బాగుండాలని కష్టపడతాడు. సెట్స్‌లో అతని డెడికేషన్ ఆకట్టుకుంటుంది. నటుడిగానే కాక నడిగర్ సంఘంలో ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు కూడా అందరికీ నచ్చాయి. ఓ మంచి హీరోతో నటించిన అనుభూతి కలిగింది అన్నారు హీరోయిన్ తమన్నా.

నేను కొంచెం నలుపులే

నేను కొంచెం నలుపులే

ఒక కమర్షియల్ సినిమాకు ప్రేక్షకుడు రావాలంటే మాటలే కాక పాటలు కూడా కీలక పాత్ర వహిస్తాయి. డైలాగ్ రైటర్ ప్రతి డైలాగును ప్రేక్షకుడికి నచ్చేలా ఈ సినిమాలో రాశారు. అలాగే పాటలను కూడా చల్లా భాగ్యలక్ష్మి చక్కగా రాశారు. ‘నేకొంచెం నలుపులే, నువ్వేమో తెలుపులే' అనే పాట నాకు చాలా నచ్చింది. పాటల్లో నా పేరును కూడా వినిపించారు. యూత్ అంతా ప్రస్తుతం ఈ పాటలే పాడుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చింది తమన్నా.

తెగ నవ్విస్తుంది

తెగ నవ్విస్తుంది

సినిమా మొత్తం నైస్ లవ్‌ట్రాక్‌తో నడుస్తుంది. మంచి పాటలు ఉన్నాయి. ఓ కామెడీ ట్రాక్ తెగ నవ్వించేస్తుంది. మంచి స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా సాగుతూ ప్రతి సన్నివేశం హైలెట్‌గానే వుంటుంది. దర్శకుడు సురాజ్ కూడా కామెడీ పాయింట్‌తో కమర్షియల్ యాంగిల్‌ను మేళవించి సినిమాలు తీయడంలో దిట్ట కనుక కుటుంబం అంతా కలిసి చూడదగిన విధంగా రూపొందించారు.

ఎవరెవరు

ఎవరెవరు

సినిమాకు పనిచేసిన టీమ్ వీళ్లే
నటీనటులు: విశాల్‌, తమన్నా, జగపతిబాబు, నిరోషా, సూరి, వడివేలు, తరుణ్‌ అరోరా, జయప్రకాష్‌, చరణ్‌ తదితరులు.
సంగీతం: హిప్‌ హాప్‌ తమిళ
సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ఎం.నాథన్‌,
మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి,
పాటలు: డా|| చల్లా భాగ్యలక్ష్మీ,
ఎడిటింగ్‌: ఆర్‌.కె. సెల్వ,
డాన్స్‌: దినేష్‌, శోభి,
సహ నిర్మాత: ఇ.కె. ప్రకాష్‌,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్‌.
నిర్మాత: హరి;
నిడివి: 2 గంటల 27 నిమిషాలు
విడుదల: శుక్రవారం

English summary
Taking a U turn on the release of Vishal’s Okkadochadu, the filmmakers decided to screen the film on December 23. The film’s release might have been brought forward to avoid box office clash with Chiranjeevi’s Khaidi No 150 and Balakrishna’s Gautamiputra Satakarni.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu