»   »  విశాల్‌ లేటెస్ట్‌ మూవీ ‘రాయుడు’ ఆడియో మే 11న

విశాల్‌ లేటెస్ట్‌ మూవీ ‘రాయుడు’ ఆడియో మే 11న

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు మాస్ అభిమానులు ఇష్టపడే తమిళ హీరోల్లో హీరో విశాల్‌ కూడా ఒకరు, ఇదివరలో విశాల్ నటించిన సినిమాలు తెలుగు లోనూ మంచి వసూళ్ళు సాధించాయి. తెలుగు మాస్ హీరొలతో సమానంగా విశాల్ నీ ఆదరించారు తెలుగు ప్రేక్షకులు. పందెం కోడి,వాడూ వీడూ లాంటి సినిమాలతో నటనా పరంగానూ మంచి మార్కులే వేయించుకున్నాడు విశాల్.......

ఇప్పుడు విశాల్ కథానాయకుడిగా, శ్రీదివ్య కథానాయికగా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న మాస్‌ ఎంటర్‌టైనర్‌ 'రాయుడు' తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. విశాల్‌ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు.

Vishal's Rayudu audio on 11th May

ఈ సందర్భంగా మాస్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ - "ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం నా కెరీర్‌లో మరో డిఫరెంట్‌ సినిమా అవుతుంది. డైరెక్టర్‌ ముత్తయ్య చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంతకుముందు నేను చేసిన సినిమాలకు పూర్తి విభిన్నంగా ఈ చిత్రంలో నా గెటప్‌ వుంటుంది. ఆల్‌ క్లాసెస్‌ ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేసే అన్ని ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో వున్నాయి" అన్నారు.

'రాయుడు' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ అధినేత జి.హరి మాట్లాడుతూ - "ఇటీవల రిలీజ్‌ చేసిన 'రాయుడు' ఫస్ట్‌ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. విశాల్‌ కెరీర్‌లోనే చాలా డిఫరెంట్‌ ఫిల్మ్‌ అవుతుందన్న అప్రిషియేషన్‌ వస్తోంది. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ విడుదలైంది. మే 11న ఈ చిత్రం ఆడియోను విడుదల చేస్తున్నాం. మే 20న 'రాయుడు' చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి" అన్నారు.

Vishal's Rayudu audio on 11th May

మాస్‌ హీరో విశాల్‌, శ్రీదివ్య, రాధారవి, సూరి, ఆర్‌.కె.సురేష్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వేల్‌రాజ్‌, సంగీతం: డి.ఇమాన్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌., ఫైట్స్‌: అనల్‌ అరసు, డాన్స్‌: బాబా భాస్కర్‌, సమర్పణ: విశాల్‌, దర్శకత్వం: ముత్తయ్య.

English summary
Vishal as Rayudu is coming Vishal confirms the Audio Release Date
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu