»   » మోహన్ బాబు ను దించే దమ్ము అతనికి ఉందా..!?

మోహన్ బాబు ను దించే దమ్ము అతనికి ఉందా..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సలీమ్"తో దుమ్ము రేపుదామనుకున్న విష్ణుబాబుకి ఆ సినిమా దుమ్ము కొట్టుకుపోవడం మింగుడు పడలేదు. ఎన్నో అంచనాలు, మరెన్నో కోట్ల రూపాయలు 'సలీమ్" పుణ్యమా అని ఆనవాలు కూడా లేకుండా కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో మళ్లీ ఎలాగైనా బాక్సాఫీస్ ను 'ఢీ" కొట్టాలనే ఆశయంతో విష్ణు సరాసరి తన తండ్రి నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ 'పెదరాయుడు" కే సీక్వెల్ చేద్దామనుకుంటున్నాడని భోగట్టా. 'పెదరాయుడు" డైరెక్ట్ చేసిన రవిరాజా పినిశెట్టి ఇపుడీ కొనసాగింపుకి కథ సిద్దం చేస్తున్నట్టు వినిపిస్తోంది. ఇందులో విష్ణు పెతరాయుడులో మోహన్ బాబు పాత్రను, మోహన్ బాబు రజనీకాంత్ పాత్రను పోషిస్తారని అంటున్నారు. సీక్వెల్ చేయడం సమస్య కాదు..కానీ తన తండ్రిని మించే సంగతి అటుంచి కనీసం ఆయనను మక్కీకి మక్కీ దించే సత్తా అయినా విష్ణులో ఉందా అన్నదే ఇప్పుడున్న సందేహం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu