మంచు విష్ణు, జి.నాగేశ్వరరెడ్డి కంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'దేనికైనా రెడీ'అనే టైటిల్ ని ఖరారు చేసారు. హన్సిక హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో షూటింగ్ సాగుతోంది. ఆద్యంతం వినోదభరితంగా నాగేశ్వరరెడ్డి ఈ సినిమాను మలుస్తున్నారు. యువతరాన్ని ఆకట్టుకునే విధంగా హన్సిక పాత్ర ఉంటుంది. క్లైమాక్స్, రెండు పాటలు మినహా సినిమా పూర్తయింది.
విష్ణు ఈ చిత్రం గురించి చెబుతూ ''రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వించేలా ఉంటుందీ చిత్రం. ప్రతి పాత్ర కావల్సినంత వినోదాన్ని పంచుతుంది. ఈ వేసవిలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము. నా కెరీర్‌లో ప్రత్యేకస్థానంలో నిలిచే సినిమా ఇది''అన్నారు. 'ఢీ' తర్వాత ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఈ చిత్రం తన కెరీర్‌లో నిలుస్తుందని విష్ణు తెలిపారు.
ఇక ఈ చిత్రం కథ గురించి దర్శకుడు చెపుతూ... ఆడుతూపాడుతూ జీవితాన్ని గడిపేసే కుర్రాడతను. ఓ అందాల భామను చూసి ప్రేమలోపడ్డాడు. ఆమె ఇంట్లోవాళ్లు సంప్రదాయాలూ... పద్ధతులూ అంటూ సవాలక్ష నిబంధనలు విధిస్తూ ఉంటారు. వాళ్లందరినీ ఒప్పించి ప్రేమను గెలిపించుకొనేందుకు అతగాడు దేనికైనా సిద్ధపడతాడు. మరి ఫలితం ఏ రీతిన వచ్చిందో తెర మీదే చూడమంటున్నారు. మంచి టైమింగ్‌తో కామెడీని పండించగలనని 'ఢీ' సినిమాతో నిరూపించారు విష్ణు. అలాగే కామెడీ సినిమాలను తెరకెక్కించడంలో జి.నాగేశ్వరరెడ్డిది అందెవేసినచెయ్యి... వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఏ రేంజిలో ఎంటర్టన్ చేస్తుందో ఊహించుకోమంటున్నారు నిర్మాతలు.
ఈ చిత్రానికి కథ- బి.వి.ఎస్.రవి, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: సిద్దార్థ్ అందిస్తున్నారు. ఎన్.వంశీకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెర వెనుక పనిచేస్తున్న వారిలో వర్మ, సెల్వ, రఘు కులకర్ణి, సాయిజ్యోతి, విజయ్ శ్రీనివాస్, సురేష్‌బాబు, నరసింహ, వాసు, సుద్దాల అశోక్‌తేజ, భాస్కరభట్ల, రామజోగయ్యశాస్త్రి తదితరులు ప్రముఖంగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వంశీకృష్ణ, సమర్పణ: శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్, నిర్మాణం: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, నిర్మాత డా.ఎం.మోహన్ బాబు.
Vishnu-Hansika's new film is titled as Denikaina Ready. Currently the film shooting is progressing in Hyderabad locales. Vishnu's Denikaina Ready shooting is in its final legs and the movie is left with climax portion and two songs. Denikaina Ready is touted to be an romantic entertainer with all commercial elements. Sri Lakshmi Prasanna Pictures is presenting the film and Vishnu's home production 24 Frames Entertainment is producing Denikaina Ready.
Story first published: Wednesday, May 9, 2012, 8:37 [IST]