»   »  విష్ణుతో ఇలియానా?

విష్ణుతో ఇలియానా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ileana
'దేవాదాసు' సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఇలియానా ఇప్పుడు మళ్ళీ వై.వి.యస్.చౌదరి సినిమాకు కమిట్ అయ్యిందని తెలుస్తోంది. తాజాగా వై.వి.యస్ చౌదరి 'సలీ...దుమ్ము రేపుతాడు' అనే చిత్రాన్ని విష్ణువర్ధన్ తో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకే ఆమె బల్క్ గా డేట్స్ ఇస్తోందని వార్తలు వినపడుతున్నాయి.ఇక ఇంకా ఈ సినిమాలో ఆనంద్ రాజా కూడా మరో ముఖ్యమైన పాత్ర చేస్తున్నాడుట.ఈ మధ్యనే అమెరికా నుంచి వచ్చిన వై.వి.యస్ తన ఆఫీసులో పూర్తి స్దాయి స్క్రిప్టు రూపొందించేందుకు రచయితలతో స్టోరీ డిస్కషన్ లో పాల్గొంటున్నారు.

సమాచారం బట్టి ఈ సినిమా ముక్కోణపు ప్రేమ కథ అని తెలుస్తోంది. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్ జరగనుంది. ఇక ఈ మధ్య చక్కగా స్లిమ్ అయిన విష్ణు కూడా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఈ చిత్రం దేవదాసు కన్నా పెద్ద హిట్టవుతుందని వై.వి.యస్ ధీమాగా ఉన్నారు.అలాగే యూత్ లో మంచి క్రేజ్ ఉన్న ఇలియానా కూడా చిత్రానికి ప్లస్ అవుతుందని ఆశిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X