»   » బొడ్డు చూపిస్తే కట్ చెప్తారా? సెన్సార్ పై మంచు విష్ణు ఫైర్

బొడ్డు చూపిస్తే కట్ చెప్తారా? సెన్సార్ పై మంచు విష్ణు ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తాప్సీ, విష్ణు కాంబినేష్ లో రూపొందిన 'వస్తాడు నా రాజు' చిత్రం ట్రైలర్స్ లో ఒక దానికి సెన్సార్ నో చెప్పింది. దాంతో విష్ణు సెన్సార్ వారిపై మండిపడుతున్నాడు. ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ...'సడేమియా...' పాటలో తాప్సి గాగ్రా చోళీ వేసుకొని ఉంటుంది. నాభి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ దృశ్యాన్ని తొలగించాలని సెన్సారు వారు పట్టు పడుతున్నారు. హీరోయిన్ బొడ్డు కనిపించినంత మాత్రాన కత్తెర వేయడం పద్దతి కాదు. అయినా మేమేమీ ఇబ్బందికరంగా ఆ ప్రోమోని చేయలేదు. ఇతర భాషల్లో మరింత ఘాటైన దృశ్యాలతో ట్రైలర్స్ చూపిస్తున్నారు. మన సెన్సార్ కి ఇలాంటి నిబంధనలెందుకో అర్థం కావడం లేదు. అందుకే ఆ ప్రోమోని యూట్యూబ్‌ లో ఉంచాను. రాజ్ ‌కపూర్‌ జీవించి ఉంటే ఇలాంటి సెన్సార్‌ కత్తెర్ల దెబ్బకి సినిమాలు తీయలేకపోయేవారేమో అన్నారు. అయితే విష్ణు చేసే ఈ హడావిడి అంతా తన ప్రోమోలపై, సినిమాపై క్రేజ్ పెంచుకోవాటానికేనని, సినిమాకు అస్సలు కొద్దిగా కూడా క్రేజ్ రాకపోవటంతో ఇలా అందరినీ డైవర్ట్ చేయటానికే ఈ వివాద వ్యూహం అమలు పరుస్తున్నాడని అని పరిశ్రమ వర్గాలు అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu