»   » మోహన్ బాబు, విష్ణు ‘రౌడీ’ అవతారం (ట్రైలర్)

మోహన్ బాబు, విష్ణు ‘రౌడీ’ అవతారం (ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మోహన్ బాబు, మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'రౌడీ'. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ట్రైలర్ విడుదలైంది. హీరో మంచు విష్ణు అమెరికాలోని న్యూజెర్సీలో ఇందుకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేసారు.

మోహన్‌బాబు కుటుంబ సన్నిహితులు పార్ధసారధి, గజేంద్ర, విజయ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపధ్యంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌బాబు విగ్ లేకుండా విలక్షణమైన పాత్రలో నటించడం గమనార్హం. మోహన్ బాబుకు జోడీగా జయసుధ, మంచు విష్ణుకు జోడీగా శాన్వి నటిస్తున్న ఈచిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

Vishnu Manchu launches 'Rowdy' trailer

ఈ చిత్రానికి సంబంధించి ఫోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పవర్‌ఫుల్ యాక్షన్ అండ్ పొలిటికల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఎమోషన్ సీన్లతో పాటు హై ఓల్టేజ్ సన్నివేశాలు ఇందులో ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రం తుది దశకు చేరుకొంది. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

సినిమాలో మోహన్ బాబు పెద్ద కుమారుడుగా కన్నడ కిషోర్, రెండవ కుమారుడుగా మంచు విష్ణు నటిస్తున్నట్లు సమాచారం. వర్మ కు అత్యంత ఇష్టమైన గాడ్ ఫాధర్ పోలికలతోనే ఈ చిత్రం తెరకెక్కుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక ట్రైలర్‌‌పై ఓ లుక్కేయండి.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/DhWjOPVg40c?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
The buzz around Ram Gopal Varma's upcoming film Rowdy has been building for the last few months ever since the movie was launched. The first look of the movie has garnered great response from fans and movie lovers. The producers are confident that the trailer will prove the buzz is right.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu