For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘మా’ ప్రెసిడెంట్‌గా నందమూరి బాలకృష్ణ: మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు.. అందుకే వెయింటింగ్ అంటూ!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ (మా) ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. ఈ మధ్య కాలంలో అధ్యక్ష పదవి కోసం సినీ ప్రముఖులు పోటీ పడుతున్నారు. దీంతో రెండు మూడు వర్గాల బరిలో నిలుస్తున్నాయి. అయితే, ఈ సారి మాత్రం ఏకంగా ఐదుగురు పోటీలో నిలిచారు. అందులో హీరో కమ్ ప్రొడ్యూసర్ మంచు విష్ణు ఒకడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు.. ఎన్నికల నుంచి తప్పుకోడానికి సిద్ధమన్నాడు. అంతేకాదు, 'మా' అధ్యక్షుడిగా నందమూరి బాలకృష్ణ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  అప్పుడే మొదలైన ఎన్నికల హీట్

  అప్పుడే మొదలైన ఎన్నికల హీట్

  తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఆర్టిస్టుల బాగోగుల కోసం కొన్నాళ్ల క్రితం మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ (మా)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. చివరిగా 2019లో ఎన్నిక జరగగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌కు పాలక వర్గం గడువు ముగియనుంది. దానికి చాలా సమయం ఉన్నా ఎన్నికల వేడి రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది.

  అండర్‌వేర్‌తో స్టేషన్‌లో సినీ ప్రముఖులు.. అలా చేస్తే పేర్లు బయట పెడతా: మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

  పోటీలో ఐదుగురు సినీ ప్రముఖులు

  పోటీలో ఐదుగురు సినీ ప్రముఖులు

  'మా' ఎన్నికల కోసం ఈ సారి మాత్రం ఏకంగా ఐదుగురు నటీనటులు బరిలో నిలిచారు. సుదీర్ఘ కాలంగా సినీ రంగంలో విశేషమైన సేవలు అందిస్తోన్న ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావులు పోటీలో ఉన్నారు. ఇందులో ప్రకాశ్ రాజ్ ఇప్పటికే ప్యానెల్‌ను కూడా ప్రకటించారు. ఆ తర్వాత మంచు విష్ణు కూడా పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నాడు.

  ఏకగ్రీవం చేయమంటూ విష్ణు వీడియో

  ఏకగ్రీవం చేయమంటూ విష్ణు వీడియో

  'మా' అధ్యక్ష బరిలో నిలిచిన మంచు విష్ణు ఇటీవల ఓ వీడియోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో 'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' స్థాపించినప్పటి నుంచి ఎన్నో విషయాలను ప్రస్థావించిన అతడు.. మా బిల్డింగ్‌ను కట్టేందుకు డబ్బులు ఇస్తానని చెప్పాడు. అంతకంటే ముందు పెద్దలంతా కలిసి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని అన్నాడు. అలా జరిగితే తప్పుకుంటానని ప్రకటించాడు.

  మద్దతిచ్చిన బాలయ్యకు విష్ణు థ్యాంక్స్

  మద్దతిచ్చిన బాలయ్యకు విష్ణు థ్యాంక్స్

  'మా' ఎన్నిక ఏకగ్రీవం అవ్వాలన్న మంచు విష్ణు మాటలకు నందమూరి బాలకృష్ణ మద్దతిచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు, భవన నిర్మాణంలో అతడికి సహాయం చేస్తానని కూడా పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు.. బాలయ్య గురించి స్పందించాడు. ఆయనకు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాడు. ఆయన తనకు సోదరుడి లాంటి వాడని చెప్పుకొచ్చాడు.

  Recommended Video

  MAA 2021 elections: RGV backs PrakashRaj in local non local controversy | Filmibeat Telugu
  మా ప్రెసిడెంట్‌గా నందమూరి బాలకృష్ణ

  మా ప్రెసిడెంట్‌గా నందమూరి బాలకృష్ణ

  తాజాగా ఓ న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన మంచు విష్ణు ఎన్నిక ఏకగ్రీవం అవడం గురించి మరోసారి మాట్లాడాడు. 'సినీ పెద్దలంతా కలిసి ఎవరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నా నాకు అభ్యంతరం అస్సలు లేదు. నందమూరి బాలకృష్ణ గారు మా ప్రెసిడెంట్ అవ్వాలని నాకు కోరికగా ఉంది. ఆయన అయితే మామూలుగా ఉండదు. ఆ దిశగా ఆలోచిస్తే బాగుండు' అంటూ వెల్లడించాడు విష్ణు.

  ఆ విషయంలో మహేశ్ బాబు అసంతృప్తి: మళ్లీ జరిగితే ఊరుకోనని వార్నింగ్.. టాలీవుడ్‌లో కలకలం రేపిన మేటర్

  అందుకే వాళ్లంతా వెయింటింగ్ అంటూ

  అందుకే వాళ్లంతా వెయింటింగ్ అంటూ

  దీనిని కొనసాగిస్తూ.. 'బాలకృష్ణ గారు ప్రెసిడెంట్ అయితే బాగుంటుందని చాలా మంది అభిప్రాయం కూడా. ఆయనే కాదు.. ఆయన జనరేషన్‌లో కొంత మంది ప్రెసిడెంట్ అవలేదు. వాళ్లలో ఎవరైనా చూడాలని ఉంది. అయితే, వాళ్లు మా కార్యకలాపాల కోసం సమయాన్ని కేటాయించగలరా అనేది డౌట్. అందుకే వాళ్లంతా ప్రెసిడెంట్ పదవి గురించి ఆగుతున్నారేమో' అని విష్ణు అన్నాడు.

  English summary
  Tollywood Actor and Producer Vishnu Manchu Recently Participated in an Interview. In This Chit Chat.. He Respond on MAA Elections 2021. And Also Comments on Nandamuri Balakrishna.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X